బిగ్ బాస్ షో రోజు రోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతుంది. రోజులు పెరుగుతున్న కొద్దీ అసలు గేమ్ స్టార్ట్ అయింది. రాహుల్, వరుణ్ ల మధ్య గొడవ జరిగిన తర్వాత బిగ్ బాస్ షోలో ఎన్నో మార్పులు వచ్చాయి. నాగార్జున గారు వారిద్దరి మధ్య గొడవని సద్దుమణిగేలా చేసినప్పటికీ, వారిద్దరూ ఇంతకుముందులా ఉంటారనేది సందేహమే. ఆదివారం ఎపిసోడ్ లో రవిక్రిష్ణ ఇంటి నుండి ఎలిమినేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.


అయితే రవి ఎలిమినేట్ అయ్యాక సొషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వార్తలలో ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది పునర్నవి గురించే. రవి ఎలిమినేట్ అయ్యాక పునర్నవి గురించి మాట్లాడుతూ, ఆమె ఎక్కడా గేమ్ ఆడినట్టు కనిపించదు. టాస్క్ లలో ఆమె పర్ ఫార్మ్ చేయడం నేనెప్పుడూ చూడలేదు అంటాడు. అయితే రవితో చాలా మంది ప్రేక్షకులు ఏకీభవిస్తున్నారు. ఎప్పుడు చూసినా అవతలి వారు అలా చేయలేదు, ఇలా చేయలేదు అని మాట్లాడుతుంది తప్పితే తానేం చేయదు అని అంటున్నారు.


ఇకపోతే పునర్నవికి మొదటి నుండి అహంభావి అనే ట్యాగ్ వచ్చింది. ఆ ట్యాగ్ ని తాను పాజిటివ్ గా తీసుకున్న పునర్నవి తనని తాను మార్చుకునే ప్రయత్నమే చేయట్లేదు. ఇన్ని మైనస్ లు ఉన్న పునర్నవి కాకుండా రవి వెళ్ళిపోయాడంటే దానికి కారణం ఆమె నామినేషన్ లోకి రాకపోవడమే. ఆమె నామినేషన్ లో ఉంటే గనక ఈ పాటికే ఎలిమినేట్ అయి ఉండేదని భావిస్తున్నారు.


అయితే ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తుంది. పునర్నవిని నామినేషన్ లోకి రాకుండా బిగ్ బాస్ కాపాడుతున్నాడని అంటున్నారు. వితికా, వరుణ్, రాహుల్, పునర్నవిల మిత్ర బృందాన్ని అప్పుడే ఎలిమినేట్ చేయకుండా బిగ్ బాస్ నామినేషన్స్ ని డిజైన్ చేస్తున్నాడని టాక్. అయితే ప్రస్తుతం వీరి స్నేహంలో ఒక డిస్ట్రబెన్స్ క్రియేట్ అయ్యింది కాబట్టి ఈ వారం పునర్నవి నామినేషన్స్ లోకి వచ్చే ప్రమాదం ఉంది. అయితే బిగ్ బాస్ స్కెచ్ ఏ విధంగా ఉందో మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: