రియల్ లైఫ్ లోనే కాకుండా రీల్ లైఫ్ లో కూడా కొందరు స్టార్స్ కలిసి నటిస్తే చూడాలని చాలామంది ఫాన్స్ అనుకోవడం చూస్తూనే ఉంటాం...అదే ఒక ఫ్యామిలీలో హీరోలయితే ఆ కోరిక ఇంకాస్త బలంగా ఉంటుంది. అయితే అలాంటి ఓ కోరికను అక్కినేని ఫ్యామిలీ నిజం చేయడానికి త్వ‌ర‌లో ‘బంగార్రాజు’ మూవీ ద్వారా  అభిమానులకి అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి తాజాగా ఓ రూమర్ వినిపిస్తోంది. నాగచైతన్య ‘బంగార్రాజు’ లో నటించనున్న సంగతి తెలిసిందే. 


నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య, సమంతను వివాహాం చేసుకొని యేడాది పైగా అవుతోంది.అభిానులు కూడా అక్కినేని వాళ్లింటి నుంచి ఆ శుభవార్త వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇపుడా  ఆశలు నిజం కాబోతున్నాయి. నాగార్జున త్వరలో తాత కాబోతున్నాడు.ఐతే..నాగార్జున తాత అయ్యేది నిజమే కానీ..రియల్ లైఫ్‌లో కాదు..రీల్ లైఫ్‌లో.  అది కూడా వాళ్ల పెద్ద కొడుకు నాగచైతన్యకు నాగ్ తాతగా నటించబోతున్నాడు.మూడేళ్ల క్రితం నాగార్జున హీరోగా..కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘బంగార్రాజు’ సినిమాలో నాగార్జున మనవడి పాత్రలో నాగ చైతన్య నటించబోతున్నాడు. 


అలానే చైతు కి జోడిగా సమంత నటిస్తుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈమధ్యే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఫుల్ స్క్రిప్ట్ తో చైతుని కలిసి కథ చెప్పినట్టు తెలుస్తుంది. చైతుకి కథ నచ్చకపోవడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే చైతు ఈమూవీ నుండి పూర్తిగా తప్పుకున్నాడా? లేదా కథలో ఏమన్నా మార్పులు చేసుకుని రమ్మన్నాడా? అనేది తెలియాల్సి ఉంది.  ఏది ఏమైన‌ప్ప‌టికీ గ‌తంలో వీరి ఫ్యామిలీ అంతా క‌లిసి మ‌నం చిత్రంలో న‌టించారు. ఆ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డంతో తిరిగి మ‌ళ్ళీ ప్రేక్ష‌కులు ఆ కాంబినేష‌న్లో చూడ‌డానికి ఆశ‌క్తి చూపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: