ఒప్పుడు భారతీయ చలన చిత్ర రంగంలో అమితాబచ్చన్, ధర్మేంద్ర,సంజీవ్ కుమార్, హేమ మాళిని ముఖ్యభూమికగా నటించిన ‘షోలే’ ఒక ట్రెండ్ సృష్టించిన విషయం తెలిసిందే.  ఒక ఊరి ప్రజలను కాపాడటానికి ఇద్దరు దొంగలు కృరమైన బందిపోటు దొంగతో తలపడతారు.  ఈ క్రమంలో సినిమాలో ఎమోషన్స్, ఫైట్స్, స్నేహితుల సెంటిమెంట్ అన్నీ మేళవించి తీశారు. ఇక బందిపోటు దొంగగా అమ్జద్ ఖాన్ మొదటి సినిమా తన డైలాగ్స్ తో ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయేలా నటించారు. 

ఇప్పటికీ ఆయన గబ్బర్ సింగ్ పాత్రలో కొట్టే డైలాగ్స్ అరే ఓ సాంబా..కిత్ నే ఆద్మీతే..అంటూ ఛలోక్తులు వేస్తూనే ఉంటారు ఆడియన్స్.  షోలే సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. హిందీ సినిమా బాక్సాఫీస్ తలరాతను మార్చిన మూవీగా చెబుతుంటారు.  ఈ సినిమా కొన్ని థియేటర్లలో ఎన్నో సంవత్సరాల పాటు కంటిన్యూ చేశారంటే ఆ మూవీకి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ మూవీలో గబ్బర్ సింగ్  అమ్జద్ ఖాన్ అరే ఓ కాలియా అంటూ విజు ఖోటే  తో కొట్టే డైలాగ్స్ ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. తాజాగా షోలే సినిమాలో నటించిన మారాఠీ నటుడు జు ఖోటే కన్నుమూశారు.

ఈ మూవీలో కాలియా అనే పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకొన్న విజు సెప్టెంబర్ 30 తేదీ ఉదయం ముంబైలో తుదిశ్వాస విడిచారు.  విజు ఖోటే ‘షోలే’ సినిమాతోపాటు అందాజ్ అప్నా అప్పా అనే మూవీలో రాబర్ట్ పాత్రలో విజు ఖోటే అద్భుతంగా నటించారు. సర్దార్ మైనే ఆప్కా నమక్ ఖాయా హై.. గల్తీ సే మిస్టేక్ హోగయా అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ బాలీవుడ్ లో మారుమోగుతూనే ఉంటాయి. 1964లో‘యా మలక్’ అనే మూవీతో కెరీర్‌ను ఆరంభించిన ఆయన 300 సినిమాలకుపైగా నటించారు. కేవలం హిందీకే పరిమితం కాకుండా మరాఠీలో తన ప్రతిభను చాటుకొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: