పూరి జగన్నాథ్ డైరక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ ఉండేలా చూసుకుంటాడు. దర్శక నిర్మాతగా పూరి చేసే సినిమాలు అందరిని అలరిస్తున్నాయి. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ హిట్ తో దుమ్ముదులిపేసిన పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.


ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఫైటర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా పూరి నిర్మాణంలో ఓ సినిమా వస్తుంది. అదే రొమాంటిక్. పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా వస్తున్న ఈ సినిమాలో కెతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అనీల్ పాదూరి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు.   


ప్రీ లుక్ లో హీరోయిన్ ను భుజాల మీదకు ఎక్కించుకుని స్టిల్ ఇచ్చిన ఆకాష్. ఫస్ట్ లుక్ పోస్టర్ లో టాప్ లెస్ హీరోయిన్ ను గట్టిగా కౌగిలించుకున్నాడు. ప్రేమ తన్మయత్వంలో హీరో హీరోయిన్ ఉన్నట్టుగా ఈ స్టిల్ చూసి చెప్పొచ్చు. అయితే హీరోయిన్ అర్ధ నగ్న ప్రదర్శన పోస్టర్ కు హైలెట్ గా నిలిచింది. డబ్ స్మాష్ బ్యూటీ కెతిక శర్మ హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది. తెలుగులో క్లిక్ అయితే ఇక తిరుగు ఉండదని కనిపెట్టిన అమ్మడు సినిమాలో రెచ్చిపోతుందని తెలుస్తుంది.


ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఈ సినిమా కేవలం యూత్ కు మాత్రమే అన్న హింట్ ఇచ్చేశారు. మెహబూబాలో మంచి నటన కనబరిచినా ఆకాష్ పూరికి తగిన క్రేజ్ రాలేదు. మరి రొమాంటిక్ మూవీ పోస్టరే షేక్ చేస్తుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సినిమాలో ఆకాష్ కు మాస్ ఇమేజ్ వచ్చేలా చేస్తున్నారు పూరి. మరి తాయుడిని హీరోగా నిలబెట్టేందుకు పూరి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: