మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. తొలి తరం రాయలసీమ ప్రాంతానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తుండగా, ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మంచి పాన్ ఇండియా ఫీల్ తో అత్యధిక బడ్జెట్ తో తెరెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషల్లో కూడా భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తోంది సినిమా యూనిట్. 

మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే జోరుగా జరుగుతున్నాయి. ఇకపోతే ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఒక ఇంటర్వ్యూ లో తన తనయుడు రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, ఈ సినిమాకు చరణ్ కాకుండా మరొక నిర్మాత కనుక దీనిని నిర్మించి ఉంటె, సినిమా ఇంత భారీ రేంజ్ లో రూపొందేది కాదని అన్నారు. ఇక కొద్ది రోజుల క్రితం తన భార్య సురేఖ గారితో కలిసి, తాను ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ చూడడానికి వెళ్లడం జరిగిందని, 

ఆ సమయంలో అల్లూరి సీతారామరాజు తెల్లవారికి వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటంలో భాగం కావడానికి ముందు ప్రిపరేషన్ కి సంబంధించిన కీలక సన్నివేశాల్ని దర్శకుడు రాజమౌళి భారీ స్థాయిలో రామ్ చరణ్ పై చిత్రీకరిస్తున్నాడట. ఆ సీన్ లో చరణ్ పడ్డ కష్టం చూసి తామిద్దరికీ గుండె ఎంతో బరువెక్కిందని మెగాస్టార్ అన్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చెప్పిన ఆర్ఆర్ఆర్ కి సంబందించిన ఈ వార్త, టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  మెగాస్టార్ గారు ఆ సినిమాలోని సీన్ గురించి అంత ప్రత్యేకంగా చెప్పారంటే, తప్పకుండా ఆ సీన్ సినిమాలో ఎంతో కీలకం అయి ఉందని అంటూ పలువురు మెగా ఫ్యాన్స్ అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: