టాలీవుడ్‌కు  సరి కొత్త హీరోయిన్‌గా  పరిచయం  అవుతున్న ఢిల్లీకి చెందిన మోడల్ కేతికా శర్మ. ప్రముఖ  డైరెక్టర్  పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా వస్తోన్న ‘రొమాంటిక్’ సినిమాలో కేతిక హీరోయిన్‌గా నటించబోతుంది

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోయిన్లు చాలా హాట్‌గా ఉంటారు అని అందరికి తెలిసందే. ఆయన గత చిత్రాలు చుస్తే ఎవ్వరికైనా అర్థమవుతుంది.రక్షిత, అయేషా టకియా, హన్సిక, నేహా శర్మ, దిశా పటాని ఇలా చాలా మంది హాట్ హీరోయిన్లను టాలీవుడ్‌కు  పూరి పరిచయం చేశారు. ఇప్పుడు మరో హాట్ బ్యూటీ ఐనా కేతికా శర్మని  పరిచయం చేస్తున్నారు.

పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా నటించబోతున్న రెండో చిత్రం ‘రొమాంటిక్’. ఇక వివరాల్లోకి వెళ్తే పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలను అన్ని కూడా  పూరి జగన్నాథ్ అందిస్తున్నారు. ఇక దర్శకత్వం  విషయానికి వస్తే అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ పాదూరి  తొలి చిత్రంకి దర్శకత్వం వహిస్తున్నారు. అందమైన ప్రేమకథా చిత్రంగా అనుసరించబోతున  ‘రొమాంటిక్’ షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇదిలా ఉండగా, ఈ సినిమా ద్వారా  మోడల్ కేతికా శర్మను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు పూరి జగన్నాథ్ . కేతికాకు  తొలి సినిమా అయినా.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి బోలెడంత ఫాలోయింగ్, ఫ్యాన్క్స్ ఉన్నారు. కేతికా ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఇన్‌స్టాలో ఈమెకు 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో తెలుస్తుంది. ఆదివారం రోజు  విడుదలైన ప్రీ లుక్‌లో ఆకాశ్ పూరి  భుజాలపై కేతికా శర్మ కూర్చున్న లుక్‌ను విడుదల చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: