దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల కు కొత్తకాదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సొంతగా బిజినెస్లు చేస్తూ కోట్లు గడిస్తున్నారు ఈ తరం హీరోయిన్లు.
అదే కోవలో  సినిమాల్లో సంపాదించిన డబ్బును ఫిట్నెస్ పై పెట్టిండుతుంది  రకుల్ ప్రీత్ సింగ్. ఫిట్నెస్ గురించి ఆమె నిత్యం ఆలోచిచే రకుల్ ఎప్పటికప్పుడు తన తనదైన స్టైల్ చూపిస్తూ ఉంటుంది.

  సినిమాలతో ఎంత బిజీ గా ఉన్నా ఫిట్నెస్ కి టైం కేటాయిస్తూ ఉంటుంది. ఈ మధ్యే ఎఫ్ 45 పేరుతో జిమ్ ను ఏర్పాటు చేసింది రకుల్. ఈ ఫిట్నెస్ వ్యాపారం ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా కోనసాగుతుంది. అటు ఇండస్ట్రీ లో ఇటు బిజినెస్ లో ఎక్కడ కూడా ఆమెకు ఇబ్బందులు లేకుండా సాగిపోతున్నది. ప్రతి సినిమాకు ఆమె చాలా ఫిట్ గా కనిపించడానికి సీక్రెట్ ఆమె వర్కౌట్. ఈ మధ్య  టాలీవుడ్లో రకుల్ కి మంచి సినిమాలే రావడం లేదు. అందుకే ప్రస్తుతం ఆమె తమిళ్, హిందీ భాషలపై దృష్టి పెట్టింది.

ప్రస్తుతం  తమిళంలో విశ్వనటుడు కమల్ హాసన్‌తో 'భారతీయుడు 2' చిత్రంలో నటిస్తోంది.  ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ప్రధాన హీరోయిన్‌ కాగా, రకుల్ రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఇదే ఇప్పుడు రకుల్ చేతిలో ఉన్న క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్. ఎప్పుడు తన హాట్ హాట్ ఫొటోలతో పోస్ట్ లు పెట్టె రకుల్ ఈ సారి కొంతగా తన ఫిట్నెస్ సీక్రెట్ ని బయట పెట్టింది.  ఫిట్నెస్ వ్యాపారం చేస్తుకుంటున్న రకుల్ రీసెంట్ గా జిమ్ వర్కౌట్ కు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

ఇందులో ఏకంగా 80కేజీల వెయిట్ లిఫ్ట్ ను ఈజీగా ఎత్తేసింది రకుల్ ప్రీత్.  దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రకుల్ అందానికి, ఆమె వర్కౌట్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు .
 


మరింత సమాచారం తెలుసుకోండి: