పూరి జగన్నాథ్ సినిమాలు అంటేనే బోల్డ్ కంటెంట్, నిక్కచ్చిగా మాట్లాడే డైలాగులు మరియు సూటిగా సంధించే ప్రశ్నలు ఉంటాయి. టాలీవుడ్ లోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి గత కొద్దికాలంగా బ్లాక్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో మరుగున పడిపోయాడు. అయితే మొన్న రామ్, నీది అగర్వాల్ మరియు నబా నటాష్ కలయికలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' వసూళ్ళ పరంగా రామ్ కెరీర్లోనే కొత్త రికార్డును సృష్టించింది. ఇదే ఊపులో పూరి విజయ్ దేవరకొండతో ఒక సినిమా కూడా సైన్ చేయించుకున్నాడు. ఇక పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి చిన్నప్పటినుంచి పూరి సినిమాలలో వేషాలు వేస్తూనే ఉన్నాడు. హీరోగా తన తండ్రే దర్శకత్వం వహించిన 'మెహబూబా' సినిమాతో ఆరంగ్రేటం కూడా చేశాడు.

ఇప్పుడు ఆకాశ్i రెండవ చిత్రం అయిన 'రొమాంటిక్' ఫస్ట్ లుక్ కొద్ది గంటల ముందే విడుదల చేశారు. పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ చిత్రం అనిల్ పడురి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను పూరి తన ఫేస్ బుక్ లో షేర్ చేయగా అందులో కొడుకు ఆకాష్ హీరోయిన్ అయిన కెటిక్ శర్మను హగ్ చేసుకొని కనిపిస్తాడు. అయితే హీరోయిన్ తన ఒంటి పై భాగంలో దుస్తులు ఏమీ లేకపోవడం పూరి కొడుకు ఒక బనియన్ వేసుకుని ఆమెను వాటేసుకోవడం... ఈ మొత్తం దృశ్యాన్ని వెనకాల నుండి ఫోటో తీసి మొదటి లుక్కుగా విడుదల చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

పూరి పెట్టిన ఈ ఫోటోకి కింద కామెంట్లులో అయితే జనాలు పూరి ని తిట్టి పడేస్తున్నారు. కొడుకు చేత ఎలాంటి సినిమాలు చేయించేది అంటూ అంతా కలిసి అతని మీద పడిపోయారు. పూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించికపోయినా నిర్మాణ బాధ్యతలు తీసుకోవడం... ఇలాంటి ఒక అభ్యంతరకర చిత్రాన్ని తనే విడుదల చేయడంతో కొంత మంది జనాలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయినా బోల్డ్ కంటెంట్ విషయంలో ఎన్నడూ వెనక్కి తగ్గిన పూరి ఈ విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇలాంటి నెగిటివ్ హైప్ రావడం సినిమా కూడా ఎంతో కొంత మేలు చేస్తుంది అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: