టాలీవుడ్ లో ఎన్నో కామెడీ సినిమాల్లో నటించిన నట కిరీటి రాజేంద్ర prasad NUVVILAA' target='_blank' title='click here to read more'>ప్రసాద్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత చాలా బిజీగా అయ్యారు.  తండ్రి, మామ, తాత పాత్రల్లో నటిస్తున్నారు.  ఓ వైపు కామెడీ పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు ప్రధాన పాత్రలను అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర prasad NUVVILAA' target='_blank' title='click here to read more'>ప్రసాద్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతోన్న సినిమా 'క్లైమాక్స్'. ఈ మూవీ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ కథలో ఆయన పాత్ర పేరు మోడీ కావడం విశేషం. 

'డ్రీమ్‌' ఫేమ్‌ భవానీ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా  'క్లైమాక్స్'. కైపాస్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై పి.రాజేశ్వర్‌ రెడ్డి, కె.కరుణాకర్‌ రెడ్డి ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. వైట్ హెయిర్,గెడ్డం, మీసాలతో ఆయన లుక్ కొత్తగా వుంది. బ్లాక్ లాంగ్ కోటుతో వున్న ఆయన, చిత్రమైన టాటూలతో కనిపిస్తూ ఆసక్తిని పెంచుతున్నాడు. రాజేశ్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమా గురించిన మిగతా విషయాలు త్వరలో తెలియనున్నాయి. డా.రాజేంద్రప్రసాద్‌, పృథ్వీరాజ్‌, శివశంకర్‌ మాస్టర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ మూవీలో సాషా సింగ్‌, రమేష్‌, చందు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవల నిర్మాత పి.రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ 'పొలిటికల్‌ సెటైర్‌ నేపథ్యంలో నడిచే మర్డర్‌ మిస్టరీ ఇది. మా సంస్థకు గొప్ప పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది. కథాంశంతో పాటు చిత్రీకరణ కూడా విభిన్నంగా, వైవిధ్యంగా ఉంటుందని అన్నారు. ఇక దర్శకుడు భవానీ శంకర్‌ మాట్లాడుతూ.. ఇందులో మోడీ పాత్రలో రాజేంద్ర prasad NUVVILAA' target='_blank' title='click here to read more'>ప్రసాద్ కనిపించబోతున్నారని..ఈ టైప్ లుక్ ఆయన మొదటిసారిగా ప్రేక్షకులు చూడబోతున్నారని అన్నారు. ఈ పాత్ర కోసం రాజేంద్రప్రసాద్‌ స్పెషల్‌గా మేకోవర్‌ అయ్యారు. కళ్లద్దాలు, టాటూస్‌కి స్పెషల్‌ కేర్‌ తీసుకున్నామని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: