సాధారణంగా సినిమా ఎలా ఉన్న క్లైమాక్స్ బాగుంటే సినిమా హిట్ అవ్వటానికి అవకాశాలు ఉంటాయి. సినిమా ఎంత బాగా తెరకెక్కించినప్పటికీ క్లైమాక్స్ సరిగ్గా లేకపోతే అర్రే కొంచంలో సినిమాని చెడగొట్టారే ప్రేక్షకులు పెదవివిరుస్తారు. ఏ సినిమాకి అయినా క్లైమాక్స్ ఓ బ్యాక్ బోన్ అనే చెప్పాలి. సైరాకి సినిమాలో కూడా క్లైమాక్స్ సీన్ గురుంచి దర్శకుడు సురేందర్ రెడ్డి కొన్ని ఆసక్తి కర విషయాలను తెలియ చేశాడు.

 

 

 

 మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. ఈ సినిమా అక్టోబర్ 2 న విడుదల అవ్వబోతుంది. కాగా ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్ లు ఈ సినిమా  పై అంచనాలను భారీగా పెంచేసాయి. అయితే ఈ సినిమా చిరంజీవి యాక్షన్ అబ్బురపరిచేలా ఉంది. అయితే ఈ సినిమాలో దర్శకుడు సురేందర్ రెడ్డి క్లైమాక్స్ సీన్ గురుంచి ఆసక్తి కర విషయాలను పంచుకున్నాడు. సైరా సినిమాలో క్లైమాక్స్ సీన్ అద్భుతంగా ఉంటుందని... ఆ సీన్ చూసినప్పుడల్లా తన మనసు ఉప్పొంగిపోతుందని దర్శకుడు తెలిపాడు. 

 

 

 

 

సైరా క్లైమాక్స్ సీన్ అందరిని హృదయాలకు తాకి భావోద్వేగాలకు గురి చేస్తుందని తెలిపాడు.ఆయన వెనుక 10 వేల మంది సైన్యం ఉందని తెలిసి ఆశ్చర్య పోయానని దర్శకుడు తెలిపాడు. బ్రిటిష్ వాళ్ల పై నరసింహ రెడ్డి ఏ విదంగా తిరుగుబాటు చేసి గజగజ వణికించారు... బ్రిటిష్ వాళ్ళు ఆయనని ఏ విదంగా బాద పెట్టారు అనే కోణంలో సినిమా ఉంటుందని తెలిపాడు. ఎంతో పరిశోధన చేసిన తర్వాతనే ఈ సినిమాను తెరకెక్కించామని తెలిపాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. కాగా ఈ సినిమా విడుదల కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: