డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇడియట్’ సినిమాతో హీరోగా మారిన రవితేజ వరుస విజయాలతో మాస్ మహరాజగా పేరు తెచ్చు కున్నాడు.  మాస్ ప్రేక్షకుల నాడి పట్టిన రవితేజ తన సినిమాలో  కామెడీ, యాక్షన్, రొమాన్స్, మాస్ మాసాల అన్ని సమపాళ్లలో ఉండేలా చేసుకున్నాడు. ఇలా మంచి విజయాలు అందుకున్న రవితేజ 2000 – 2011 వరకు రిలీజ్ అయిన సినిమాలు హిట్ టాక్  తెచ్చుకున్నాయి.  ఇక బాబి దర్శకత్వంలో వచ్చిన పవర్ సినిమా తర్వాత మనోడి బ్యాడ్ టైమ్ మొదలైంది.  కిక్ 2, బెంగాల్ టైగర్ లో ఏకంగా లుక్ కూడా మారడంతో రవితేజపై కొత్త పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి.

2011 లో విడుదల అయిన ‘డాన్ శీను’ సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీకి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు.   ఈ మూవీలో అమితాబచ్చన్ ఫ్యాన్ గా రవితేజ నటనతో దుమ్మురేపాడు.  ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘బలుపు’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకొని రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ  ‘రాజా ది గ్రేట్’ బంపర్ హిట్ కొట్టాడు.  కానీ ఆ తర్వాత వచ్చిన ‘టచ్ చేసి చూడు’, ‘నెల టికెట్’, ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇదే సమయంలో గోపిచంద్ మలినేని ఓ మంచి స్టోరీతో రవితేజ వద్దకు వెల్లారట కానీ ఈ లోపు ‘వి.ఐ. ఆనంద్’ తో చేస్తున్న ‘డిస్కో రాజా’ విషయం తెలిసి కొంచెం గ్యాప్ తీసుకున్నాడు.

‘డిస్కోరాజా’ మూవీ తర్వాత రవితేజ తనకు గతంలో సూపర్ హిట్స్ అందించిన గోపిచంద్ మలినేనితో తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ‘ఒంగోలు’ ఏరియా లో ‘పోలీస్ ఆఫీసర్’ గా కనిపిస్తారంటా, ఒంగోలు లో జరిగే అక్రమాలని చెరిపే అధికారిగా ఉంటూ అతనికి వచ్చిన అనుకోని ఆపదనుండి ఎలా బయటపడ్డాడో అనే లైన్ లో సాగనుందట. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూవీ సూపర్ హిట్ కొడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: