మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన కం బ్యాక్ సినిమాగా వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ హిట్ ని అందుకుని, తన స్టామినా మరియు చరిష్మా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. ఇకపోతే దాని తరువాత ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. తొలి తరం రేనాడు ప్రాంతానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారత దేశంలోని సినిమా లవర్స్ అందరిలోనూ మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి అని చెప్పాలి. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు కోలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్ కు చెందిన అగ్ర నటులు నటిస్తుండగా, 

విలక్షణ నటుడు జగపతి బాబు, తమన్నా, అనుష్క శెట్టి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై మాస్, కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తనదైన శైలిలో నేడు తన అభిప్రాయాన్ని ఒక మీడియా ఛానల్ ద్వారా షాకింగ్ గా తెలిపారు. నిజానికి తనకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే ఎవరో కూడా ఇప్పటివరకు తెలియదని, ముందుగా అందరూ తనను ఈ విషయమై మన్నించాలని కోరుతున్నట్లు చెప్పారు హరీష్ శంకర్. ఆయన గొప్ప మహానుభావుడు అనే విషయం చిరంజీవి గారు సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న తరువాతనే తనకు తెలిసిందని, అటువంటి గొప్ప యోధుడి కథను సినిమాగా తీసి, 

ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి సిద్దమైన మెగాస్టార్ గారికి, నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి తన హృదయపూర్వక పాదాభివందనాలు చెప్తున్నానని అన్నారు. అయితే ఆ సినిమాపై పలు వివాదాలు బయట చెలరేగడంపై హరీష్ మాట్లాడుతూ, ఇటీవల తమ సినిమాకు టైటిల్ మార్చవలసిందిగా పలువురు ఇబ్బందులకు గురిచేసి, చివరకు టైటిల్ మార్చేవరకు ఊరుకోలేదని, అలానే ప్రస్తుతం సైరా సినిమాకు మంచి పేరు వస్తుందని భావించి, కొందరు ఆ సినిమాపై లేనిపోని రాద్దాంతం చేయడం సరైనది కాదని, అయినా ఆ విధంగా రాద్దంతాలు చేసి మంచి సినిమాను, అలానే చిరంజీవి గారి వంటి గొప్ప వ్యక్తులను రచ్చకి ఈడ్చాలని అనుకోవడం సరైనదని కాదని అభిప్రాయపడ్డారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: