గత రాత్రి బిగ్ బాస్ షో కొంచెం రసవత్తరంగా జరిగింది. చివరికి ఎవరు ఎలిమినెట్ కాబోతున్నారో ప్రేక్షకులకు కూడా అర్ధం అయ్యే పరిస్థితి వచ్చింది.    శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్, రవి కృష్ణ టైటిల్ హాట్ పేవరేట్స్ గా విన్నర్స్ లిస్ట్ లో ఉండగా మొదటినుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన సీరియల్ ఆర్టిస్ట్ రవి కృష్ణ ఎలిమినేట్ కావడమే ఇందుకు కారణం. ముందు నుండి  శ్రీముఖి కి ప్రాబ్లెమ్ లేదు అని బిగ్ బాస్ వీక్షకులకు అర్ధం అయిపోయింది. ఎందుకంటె ఎలిమినేషన్ వరకు వెళ్లినా ఎదో విధంగా శ్రీ ముఖి సేఫ్ గా బయట పడుతూనే వచ్చింది.  

కానీ బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్స్ ద్వారా బాగా దగ్గరైన నటుడు రవి కృష్ణ. గేమ్ మొదటి రోజు నుండి సేఫ్ గా గేమ్ ఆడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు రవి కృష్ణ. ఆయనకు ఒక తరగతి వర్గం యొక్క మద్దతు ఉండటంతో పాటు, ఆకట్టుకొనే ప్రదర్శనతో ఇప్పటి వరకు  టైటిల్ విన్నర్స్ లో ఒకరుగా ఉంటూ వచ్చారు. ఐతే అనూహ్యంగా నిన్న ఆయన బిగ్ బాస్ హౌస్ కి బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పదో వారంలో వితికా తో తలపడి నామినేషన్స్ లోకి వచ్చిన అతడికి ఫాలోయింగ్ తక్కువగా ఉండడంతో అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.సో ఈ వారం రవికృష్ణ ఎలిమినేట్ అయి పునర్నవి పై బిగ్బాస్ వేశాడు ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ బట్టలు మొత్తం పునర్నవి ఉతకాలని నాగార్జున టాస్క్ విధించారు.ఈ విధంగా చూస్తే టైటిల్ పేవరేట్స్ లో కేవలం ముగ్గురే మిగిలినట్టు లెక్క. వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్ల లో ఒకరు టైటిల్ గెలుస్తారనే వాదన గట్టిగా వినిపిస్తుంది.
 
మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అలీ రైజా రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయనకు గెలుపు అవకాశాలు తక్కువనే చెప్పాలి. దానికి కారణం ఒకసారి బయటికి వెళ్లొచ్చిన అలీ రెజా గెలిస్తే షో విమర్శలపాలయ్యే అవకాశం కలదు. అంచనాలకు అతీతంగా నడిచే బిగ్ బాస్ షోలో ఏమైనా జరగొచ్చు.


    మరింత సమాచారం తెలుసుకోండి: