ఈరోజుల్లో చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండటం లేదు. అలాగే సినీ ఇండస్ట్రీలో చాలా మంది  డాక్టర్ కావాలి అనుకుని అనుకోకుండా  ఎంతోమంది యాక్టర్ ఆయిన వాళ్ళు ఉన్నారు.ఇక సినీ ఫీల్డ్ లో హీరోయిన్ విషయానికి వస్తే ఎంత మనోహరంగా కనిపించినా కేవలం వాళ్లు హీరోయిన్ అవ్వాలని వచ్చిన వాళ్లు కాదు.  స్టడీస్ పరంగా వివిధ రంగాల్లో లో డిగ్రీలు పుచ్చుకున్న వాళ్లు ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.  ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారి క్వాలిఫికేషన్స్ చూద్దాం.

కమల హాసన్ డాటర్ శృతి హాసన్ సైకాలజీ గ్రాడ్యుయేట్. మిల్కీ బ్యూటీ తమన్నా ముంబై లోని జాతీయ కళాశాల నుండి బి ఏ డిగ్రీ పొందింది.  మంచు లక్ష్మి - ఓక్లహోమా నగర విశ్వ విద్యాలయం నుండి థియేటర్ లో బ్యాచిలర్  డిగ్రీ పూర్తి చేసింది.  వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రకుల్ ప్రీత్ సింగ్ డిగ్రీ పూర్తి చేసింది.  

ఇక మహానటి కీర్తి సురేష్ ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ.  రెజీనా సైకాలజీలో డిగ్రీ చేసింది.  ఇక కాజల్ అగర్వాల్ ఆఫ్ మాస్ మీడియా కే సి కాలేజి ముంబైలో చదివింది.  ఇక యోగా బ్యూటీ స్వీటీ అనుష్క శెట్టి బ్యాచ్లర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. తెలుగు అమ్మాయి అంజలి మ్యాథమెటిక్స్ డిగ్రీ పూర్తి చేసింది. శ్రద్దా దాస్ జర్నలిజంలో డిగ్రీ చేసింది. బయోటెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసింది. 

కలర్స్ ప్రోగ్రాం ద్వారా బుల్లి తెర నుండి వెండి తెరకు పరిచయం ఐన స్వాతి రెడ్డి బయో టెక్నాలజీ లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది.ఇలియానా డి-  క్రజ్  బొంబాయి విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకుంది. శ్రేయ శరణ్ సాహిత్యం లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్.  త్రిష - ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేయగా పూజ హెగ్డే కాలేజీలో డిగ్రీ చేసింది.  రష్మిక మందన్న మరియు ఇంగ్లీష్ లిటరేచర్ లో బిఎ పూర్తి చేసింది


మరింత సమాచారం తెలుసుకోండి: