మెగాస్టార్ చిరంజీవి 15వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.  ఈ మూవీ అక్టోబర్ 2 ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.  కొణిదెల ప్రొడక్షన్ లో రాంచరణ్ నిర్మిస్తున్న ఈ మూవీకి రూ.300 బడ్జెట్ అయినట్లు సమాచారం.  మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ గా తెరకెక్కుతున్న ‘సైరా’ రిలీజ్ కన్నా ముందే పలు వివాదాల్లో చిక్కుకుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 

బ్రిటీష్ సైన్యాన్ని ముచ్చెమటు పట్టించిన రేనాటి వీరుడు..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తీసిన ‘సైరా’మూవీ షూటింగ్ సమయంలో తమకు కొంత డబ్బు ఇస్తామని ఉయ్యాలవాడ కుటుంబీకులు అంటున్నారు. కానీ ‘సైరా’ చిత్ర యూనిట్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని..సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా చిత్రీకరణ సమయంలో తమకు ఇచ్చిన హామీలను చిరంజీవి, రామ్ చరణ్ లు నిలబెట్టుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ ప్రమోషన్ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ..నరసింహారెడ్డి వారసులమంటూ 23 కుటుంబాల వారు ఒక్కొక్క కుటుంబానికి రూ. 2 కోట్లు చొప్పున డిమాండ్ చేస్తున్నారని... దాదాపు రూ. 50 కోట్లు ఎక్కడ నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు.  అయితే దీనిపై స్పందించిన ఉయ్యాల కుటుంబ సభ్యులు చిరంజీవి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. చరణ్ చెప్పినట్టుగా తాము ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షలు అడిగామని తెలిపారు.అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు సినిమాకు సంబంధించి తాము వేసిన కేసులను వెనక్కి తీసుకుంటున్నామని వెల్లడించారు.  మొత్తానికి ఈ మూవి అక్టోబర్ 2న రిలీజ్ కావడానికి ఇక ఏ అడ్డుంకులు లేనట్లే అని భావిస్తున్నారు టాలీవుడ్ వర్గం. 


మరింత సమాచారం తెలుసుకోండి: