పూరీ జగన్నాథ్ సినిమాలలో రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. ఖచ్చితంగా ఒక బీచ్ సాంగ్ ప్లాన్ చేసుకొని ఆ సాంగ్ ను అద్భుతంగా తీసతాడు. థియోటర్స్ లో ప్రేక్షకులు కూడా ఆ సాంగ్ ను బాగా ఎంజాయ్ చేస్తారు. తన ప్రతి సినిమాలోను పక్క ఒక రొమాంటిక్ సాంగ్ ఉండాలని స్క్రిప్ట్ రాసుకున్నపుడే పూరి ఫిక్స్ అవుతారని చాలామంది మాట్లాడుకుంటారు. ఇక తన కొడుకు ఆకాష్ హీరోగా నటిస్తున్న రెండవ సినిమా రొమాంటిక్. ఈ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించడం లేదు. అయితే ఈ సినిమా వెనుక మాత్రం ఆయనే ఉన్నారు. ఆ విషయం ఫస్ట్ లుక్ తోనే స్పష్టం అవుతోంది. పూరీ మార్కు రొమాంటిక్ స్టిల్ ను ఫస్ట్ లుక్  గా విడుదల చేసి అందరిని ఆశ్చర్యపరచారు. ఎందుకంటే ఇంత రొమాంటిక్ పోస్టర్ ను పూరి ఇప్పటి వరకు విడుదల చేయలేదు.
 
దశాబ్దంన్నర కిందట ఇడియట్ సినిమా టైటిల్ లోగోలో హీరో రవితేజ, ఆ సినిమా హీరోయిన్ రక్షితను కౌగిలించుకున్న స్టిల్ చూసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. అప్పుడే ఇదేంటి ఇలాంటి పోస్టర్ అంటు పూరి మీద రక రకాల కామెంట్స్ చేశారు. అయితే అప్పటికీ ఇప్పటికీ రోజులు చాలా మారాయి. ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన మార్పు వచ్చింది. రొమాంటిక్ సినిమాలను ఎంతగా హిట్ చేస్తున్నారో అర్జున్ రెడ్డి, ఆర్.ఎక్స్.100 సినిమాలు చూస్తే అర్థమవుతుంది. అందుకే ఏకంగా పూరీ ఈసారి హీరోహీరోయిన్లను అర్ధ నగ్నంగా నిలబెట్టేశాడు. 

రొమాంటిక్ అంటూ ఈ సినిమా టైటిల్ పెట్టినందుకు అర్థంగా అలా కౌగిలింతతో మొదలుపెట్టినట్టుగా అనిపిస్తుంది తాజా పోస్టర్ చూస్తుంటే. అయితే.. ఇది రొమాంటిక్ గా లేదు. ఇందులో రొమాన్స్ కన్నా ఇంకేదో... ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా ఉందని అప్పుడే కొంతమంది కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. హీరోయిన్ ని టాప్ లెస్ గా చూపించేసి గట్టిగా కౌగిలింపజేస్తే తప్ప రొమాన్స్ పండదా..? అంటు ట్రోల్స్ మొదలైయ్యాయి.  ఇక తెలుగు సినిమా వాళ్లు కూడా ఒక రకమైన ఫార్ములాని ప్రేక్షకులకు అలవాటు చేస్తున్నట్టు ఈ పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది. ఎవరో కొత్త డైరెక్టర్ అయితే ఇలాంటి వాటి మీద ఆధారపడి సినిమా చేస్తారు. కానీ పూరి లాంటి వాళ్ళు కూడా ఇలా చేయడం ఏంటి..? అన్న సందేహాలు చాలామందిలో కలుగుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: