టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకధీరుడుగా పేరు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలు తెరకెక్కించారు.  తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో ఎలుగెత్తి చెప్పిన ఘనత రాజమౌళికే దక్కుతుంది.  ప్రభాస్ హీరోగా ‘బాహుబలి, బాహుబలి2’ సినిమాలు వ్యూజువల్ వండర్ క్రియేట్ చేయమే కాదు..అప్పటి వరకు బాలీవుడ్ లో ఉన్న రికార్డులు బద్దలు కొట్టాయి.  ఇక మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ తో తీసిన ‘మగధీర’ ఆయన కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలవడమే కాదు ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేసింది. 

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతుంది.  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ ప్రమోషన్ లో ఉన్న విషయం తెలిసిందే.  సైరా లాంటి ప్రతిష్టాత్మక మూవీ తన కొడుకు తనకు కానుకగా ఇవ్వడం నిజంగా జీవితంలో మర్చిపోలేనిది అని అన్నారు.  నా బిడ్డ ఇంత ధైర్యం చేసి రూ.300 ఖర్చు పెట్టి సినిమా నిర్మిస్తున్నాడు..అతని ధైర్యాన్ని మెచ్చుకోవాలి..నా నిర్మాతల్లో నెం.1 నిర్మాత చెర్రీ అని నేను గర్వంగా చెప్పుకుంటానని అన్నారు.

తాజాగా మరో విషయాన్ని గుర్తుకు చేశారు మెగాస్టార్ చిరంజీవి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - చరణ్ ప్రధాన పాత్రలను పోషిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతున్న సమయంలో.. చిరంజీవి దంపతులు చూడటానికి వెళ్లారట. సీతారామరాజు విప్లవ వీరుడిగా మారే క్రమంలో ఆయనకి ఎదురైన ఒక సంఘటనగా, తాళ్లతో కట్టి కొడుతూ ఈడ్చుకెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారట. అసలే రాజమౌళి ఈ మూవీలో ఎలాంటి గ్రాఫిక్స్ హంగామా ఉండదని చెప్పాడు.

అయితే ఈ సీన్ చాలా నేచురల్ గా తీస్తుండటండ చూసి.. చిరంజీవి చాలా ఎమోషనల్ అయ్యారట. ఆ సన్నివేశం చూసి సురేఖ ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారట.  సీతారామరాజుకి ఎదురైన పరిస్థితి,  రాజమౌళి చిత్రీకరిస్తోన్న విధానం  ఆ సన్నివేశానికి ప్రాణం పోయడానికి చరణ్ పడుతున్న కష్టం వాళ్లను ఉద్వేగానికి గురిచేసి ఉంటుందని చెప్పుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: