సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా 'సైరా'. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్న, నిహారికా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. ఈ నెల 22 న నిర్వహించిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. మరో వైపు ఉయ్యాలవాడ వంశస్థులు దీని మీద పోరాటం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే 'సైరా' నుండి టైటిల్ సాంగ్ వీడియో 'ఓ సైరా' ను విడుదల చేశారు. ఈ సినిమాకు బాణీలు అందించినవారు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది. 

సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించగా సునిధి చౌహాన్.. శ్రేయ ఘోశల్ పాడారు. 'పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవురా ఉయ్యాలవాడ నారసింహుడా' అంటూ నరసింహారెడ్డి వీరత్వం గురించి.. ఆయన గొప్ప లక్షణాల గురించి కీర్తిస్తూ సాగుతుంది ఈ పాట సాహిత్యం. అయితే ఇంతమంచి సాహిత్యానికి తగిన న్యాయం జరగలేదనిపిస్తోంది. అమిత్ త్రివేది కంపోజ్ చేసిన ట్యూన్ అసలు ఏమాత్రం పవర్ఫుల్ గా లేకపోవడంతో రొటీన్ గా వినిపించింది.  ట్యూన్ లో కొత్తదనం లేకపోవడం, ఈ పాటను పాడిన బాలీవుడ్ సింగర్ సునిధి చౌహాన్ వాయిస్ ఈ పాటకు అసలు సూట్ కాకపోవడంతో ఎంతో కష్టపడి సాహిత్యమందించిన శాస్త్రి గారి సాహిత్యం వృధా అన్న కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. శ్రేయ ఘోశల్ పాడిన బిట్ వారకూ బాగానే ఉన్న అది కూడా వేస్టేనన్న మాట వినిపిస్తుంది.

విజువల్స్ లో ఇక ఈ పాటకు సంబందించినవే కాకుండా ఇంపాక్ట్ కోసం యాక్షన్ సీక్వెన్సులకు సంబందించినవి కూడా జోడించారు. మరి ఈ పాట బిగ్ స్క్రీన్ పై ఎలా ఉంటుందనేది ఇప్పుడు మెగా అభిమానుల్లో మెదలుతున్న ఆలోచన. డిసప్పాయింట్ చేస్తుందేమోన్న సందేహాలు ఉన్నాయి. ఏదేమైనా ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాకు బాణీలు అందించడం మాత్రం కత్తిమీద సామే అని చెప్పాలి. మరో వైపు కీరవాణి లాంటి వాళ్ళు గనక అయితే ఇదే పాట రేంజ్ ఇంకోలా ఉండేదని ఫీలవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: