నాచురల్ స్టార్ నాని సినిమా అంటే పక్కా హిట్ అన్న టాక్ వచ్చింది. స్టార్ అభిమానులు కూడా నాని సినిమా అంటే ఒకసారి చూసేయొచ్చు అన్న ఆలోచన చేస్తారు. అయితే నాని సినిమాలు ఈమధ్య హిట్ టాక్ తెచ్చుకున్నా కలక్షన్స్ విషయంలో మాత్రం ఆ దూకుడు చూపించడం లేదు. రీసెంట్ గా నాని చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా కూడా అంతే.. మొదటి షో నుండి హిట్ టాక్ తెచ్చుకున్న్ ఈ సినిమా వసూళ్లు మాత్రం సాధించలేదు.


వరల్డ్ వైడ్ గా 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన నాని గ్యాంగ్ లీడర్ మూవీ 17 రోజుల్లో 23 కోట్లు షేర్ రాబట్టింది. అంటే ఎలా లేదన్నా ఈ మూవీ కూడా 4, 5 కోట్లు లాస్ తెచ్చేలా ఉందని చెప్పొచ్చు. నాని సినిమాలు మొదటి రోజు హిట్ టాక్ తెస్తేనే పరిస్థితి ఇలా ఉంటే ఒకవేళ టాక్ బాగా లేకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.


గ్యాంగ్ లీడర్ సినిమా విషయంలో కథ కథనాలు బాగున్నా కమర్షియల్ అంశాలు మిస్ అవడం.. మాస్ ని మెప్పించే అంశాలు లేకపోవడం మైనస్ అయ్యిందని చెప్పొచ్చు. అదీగాక గ్యాంగ్ లీడర్ కు వారం ముందు ప్రభాస్ సాహో మూవీ వచ్చింది. ఇక నాని వచ్చిన మరో వారం తర్వాత గద్దలకొండ గణేష్ అంటూ వరుణ్ తేజ్ వచ్చాడు. ఇలా సినిమా హిట్ టాక్ వచ్చినా ఆ సినిమాల ఎఫెక్ట్ నాని గ్యాంగ్ లీడర్ మీద పడ్డదని చెప్పొచ్చు.


అయితే నాని ఇక మీదట అలా జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే తను చేసే ప్రతి సినిమా ఇలానే జరిగితే అతని కెరియర్ గ్రాఫ్ కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. సుధీర్ బాబు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: