నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సంపాదించడం జరిగింది. ఒక రివెంజ్ స్టోరీ ని ఆకట్టుకునే కథ, కథనాలతో మంచి ఎంటర్టైనింగ్ గా దర్శకుడు విక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే తొలి రోజు ఎంతో మంచి టాక్ ని సంపాదించిన ఈ సినిమా, నాలుగు రోజుల వరకు మంచి కలెక్షన్ తో ముందుకు సాగింది. ఆ తరువాత సడన్ గా ఈ సినిమా కలెక్షన్స్ పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. మొదట్లో అదరగొట్టే కలెక్షన్స్ రాబట్టడంతో, 

ముందు ముందు మరింత అద్భుతంగా పెర్ఫర్మ్ చేసి బయ్యర్లకు లాభాలు అందిస్తుంది అనుకుంటే, మొత్తంగా క్లోసింగ్ సమయానికి రూ.5 కోట్ల రూపాయల వరకు నష్టాలు మిగిల్చింది గ్యాంగ్ లీడర్. అయితే ఈ సినిమా కొంత దెబ్బతినడానికి రొటీన్ గా ఉన్న స్క్రీన్ ప్లే కూడా కారణం అయి ఉండవచ్చని అంటున్నారు, ఎందువలన అంటే, విక్రమ్ కుమార్ నుండి మంచి వెరైటీ స్టోరీని ఆశించిన ప్రేక్షకులు ఒక సాధారణ రివెంజ్ డ్రామాని ఈ సినిమా కథా వస్తువుగా ఎంచుకోవడం కొంతమంది ప్రేక్షకులకు రుచించలేదని టాక్. ఏది ఏమైనా బయ్యర్లను నష్టాల పాలు చేసిన గ్యాంగ్ లీడర్ ఓవర్ ఆల్ గా ఎంత కలెక్షన్ ని రాబట్టాడంటే, 

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 17 రోజులకు గాను రూ.17 కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టిన ఈ సినిమా, ఇక తెలుగేతర రాష్ట్రాలైన కర్ణాటక, మరియు ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.1.93 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ.4.24 కోట్లు వసూలు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 23 కోట్ల షేర్ ను రాబట్టడం జరిగింది. అయితే నాని గత సినిమా అయిన జెర్సీ మంచి సక్సెస్ సాధించడంతో, గ్యాంగ్ లీడర్ కు రూ. 28 కోట్ల మేర బిజినెస్ జరిగిందని, ఇక దీనికి వచ్చిన కలెక్షన్ ని బట్టి చూస్తే గ్యాంగ్ లీడర్ వలన బయ్యర్లు బాగానే నష్టపోయినట్లు అర్ధం అవుతుంది......!!   


మరింత సమాచారం తెలుసుకోండి: