‘సైరా’ మ్యానియాను తట్టుకుని గోపీచంద్ ‘చాణక్య’ కనీస ఓపెనింగ్ కలక్షన్స్ తెచ్చుకోగలుగుతుందా అంటూ సెటైర్లు పడుతున్న పరిస్థితులలో ‘సైరా’ కు పరోక్షంగా ‘చాణక్య’ మూవీలో నటించిన గోపీచంద్ విలన్ సహాయం చేయడం హాట్ న్యూస్ గా మారింది. ఈ వారం విడుదల కాబోతున్న ‘చాణక్య’ లో బాలీవుడ్ యాక్టర్ రాజేష్ కత్తర్ విలన్ గా నటిస్తున్నాడు. 

ఇతడు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడుగా పేరు తెచ్చుకోవడమే కాకుండా అనేక హిందీ హాలీవుడ్ సినిమాలకు డబ్బింగ్ చెప్పిన మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. అత్యంత గంభీరంగా ఉండే ఇతడి గొంతు ‘సైరా’ హిందీ వెర్షన్ లోని ఉయ్యాలవాడ పాత్రకు సరిపోతుందని భావించి ఇతడిచేత చిరంజీవికి హిందీ డబ్బింగ్ చెప్పించారు.

ఈ విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే ‘చాణక్య’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఈ బాలీవుడ్ స్టార్ రాజేష్ కత్తర్ మాట్లాడుతూ తన జీవితంలో చిరంజీవికి డబ్బింగ్ చెపుతానని తాను కలలో కూడ అనుకొలేదనీ అంటూ ‘సైరా’ మూవీ తనకు ఒక ప్రత్యేకం అంటూ ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు ఉద్వేగ పూరితంగా ఉయ్యాలవాడ పాత్రలో నటించిన చిరంజీవి ఎమోషన్స్ కు తగ్గట్టుగా తాను డైలాగ్స్ చెప్పే విషయంలో తనకు 17 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ఆ అనుభవం చిరంజీవి నటన ముందు సరిపోలేదు అంటూ మెగా అభిమానులకు దగ్గర కావడానికి ప్రయత్నించాడు.

ప్రస్తుతం ‘చాణక్య’ మూవీలో నటిస్తున్న రాజేష్ కత్తర్ నెగిటివ్ పాత్ర ఆ మూవీకి అత్యంత కీలకం అనీ ఈ మూవీ ఫస్ట్ కాపీని చూసినవారు చెపుతున్నారు. ఈ మూవీ తరువాత బాలీవుడ్ స్టార్ కు తెలుగులో విపరీతమైన అవకాశాలు రావడం ఖాయం అని అంటున్నారు. దీనితో ఇతడి సమర్ధత వలన అయినా గోపీచంద్ కు అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: