అందరి దారి ఒకటైతే తన దారి మరొకటి అన్నట్టు ఉంటాడు టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాథ్. ఎంతమంది కొత్తవాళ్లొచ్చినా సరే పూరి స్టైల్ మేకింగ్ ఎవరికి రాదు. తన సినిమాల్లో కమర్షియాలిటీ ఉంటుంది.. యాక్షన్ ఉంటుంది.. అన్నిటిని మించి రొమాన్స్ బీభత్సంగా ఉంటుంది. హీరోయిన్ ను వాడటమంటే అప్పట్లో రాఘవేంద్ర రావు ఇప్పుడు పూరి అనేయొచ్చు.


పూరి ఎలాగు సినిమాల్లో పడి ఆడియెన్స్ ను మెప్పించడమే తన పని అనుకుంటున్నాడు. ఇక ఇప్పుడు తన తనయుడిని కూడా ఈ ఇండస్ట్రీలోకి దించాడు. ఆకాష్ పూరి హీరోగా ఆంధ్రాపోరి సినిమా వచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత పూరి డైరక్షన్ లో వచ్చిన మెహబూబా కూడా నిరాశపరచింది.   


అందుకే పూరి ఈసారి ఆకాష్ తో ఓ బోల్డ్ సబ్జెక్ట్ చేస్తున్నాడు. రొమాంటిక్ అంటూ వస్తున్న ఆకాష్ సినిమా ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజైంది. ఈ ఫస్ట్ లుక్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతుందో అర్ధమవుతుంది. హీరోయిన్ కెతిక కూడా సెమీ న్యూడ్ గా చెలరేగిపోతున్నట్టుగా ఉంది. అయితే ఈ పోస్టర్స్ చూసిన కొందరు ఆడియెన్స్ పూరి కొడుకుని కూడా పాడుచేస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.  


అయితే హీరో అన్న తర్వాత అన్ని సినిమాలు చేయాలి.. కేవలం ఒకే రకమైన సినిమాలే చేస్తా అంటే కుదరదు. ఎలాగైనా తను సినిమాలు ఆపేసే టైం కు ఆకాష్ ను హీరోగా నిలబడేలా చేయలన్న ఆలోచనలో ఉన్నాడు పూరి జగన్నాథ్. డబ్ స్మాష్ బ్యూటీ కెతిక శర్మ అయితే ఈ సినిమాతో తెలుగులో క్రేజీగా మారబోతుందని మాత్రం చెప్పొచ్చు. ఇప్పటికే తన హాట్ స్టిల్స్ తో కుర్రాళ్లను డిస్ట్రబ్ చేస్తున్న ఈ అమ్మడు రొమాంటిక్ సినిమా హిట్ అయితే మాత్రం తెలుగులో మరిన్ని ఛాన్సులు అందుకునేలా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: