ప్రముఖ నటుడు విక్రమ్ కొడుకు ధ్రువ్ "ఆదిత్య వర్మ " సినిమా తో తమిళ తెరకు పరిచయమవుతున్నాడు. ఈ సినిమా తెలుగులో సందీప్ రెడ్డి వంగా విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాకి అఫీషియల్ రీమేక్. ఆదిత్య వర్మ సినిమా ను మొదట బాల దర్శకత్వం లో వర్మ గా తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం నిర్మాతలను నచ్చకపోవడంతో కొత్త దర్శకుడి తో సినిమా మొత్తాన్ని రీ-షూట్ చేయించారు.

ఈ సినిమా పేరు ను ఆదిత్య వర్మ గా మార్చారు . రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో ధ్రువ్  పలు అసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వర్మ టీజర్ విడుదలైన తరువాత  అందరు నా నటన పైన మరియు నా లుక్ పైన చాలా కామెంట్స్ చేశారు. ఆ విమర్శలు నన్ను చాలా బాధించాయి. ఈ సినిమా కోసం నా జీవతం లో మొదటి సారిగా గడ్డం పెంచాను. కానీ అందరు నాకు గడ్డం సెట్ కాలేదు అని చెప్పారు. నిర్మాతలు ఈ సినిమా కోసం మందు మరియు పొగ తాగమని  చెప్పారు. నాకు మందు, పొగ తాగడం అలవాటు లేదు. అవి రెండు  అలవాటు చేసుకోవడం  కొంచెం కష్టంగా అనిపించాయి.


క్యారెక్టర్ లో ఒదిగిపోవడానికి ఇంట్లో వారితో   తక్కువగా మాట్లడేవాడిని,  రూమ్ లో ఒక్కడినే ఉండి సంగీతం వినేవాడిని.  కొన్ని రోజుల తరువాత  చిన్న చిన్న విషయాలకు  అందరి పై అరవడం  మొదలు పెట్టాను అని చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం డాడీ నా తోనే ఉన్నాడు.  నటించేటప్పుడు ఆయన సలహలు తీసుకున్నాను . బనితా సంధు, ప్రియా ఆనంద్ లు  హీరోయిన్స్ గా నటిస్తున్నారు.గిరీశాయా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.ఆదిత్య వర్మ  సినిమా నవంబర్ లో రిలీజ్ కానుంది


మరింత సమాచారం తెలుసుకోండి: