సినీ పరిశ్రమలో చాలా సినిమాలో షూటింగ్ పూర్తయ్యాక ఒక వారం అనుకుంటే అదే వారంలో అంటే ఒకే రోజు రెండు సినిమాలు లేదా.. వారం పొడవునా సినిమాలు రిలీజ్ అవుతాయి. వాటిలో ఎదో ఒక సినిమా హిట్ అవ్వడం లేదా అన్ని సినిమాలు హిట్ అవ్వడం వంటిది జరుగుతుంటుంది. ఇకపోతే ఈ  అక్టోబర్ మొదటి వారంలో కూడా మూడు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. 


వివరాల్లోకివెళితే.. ఆ నెల ఆరంభంలోనే పెద్ద సినిమాలు పోటీలో ఉన్నాయి. తమిళ విషయానికొస్తే ఈ వారంలో ప్రేక్షకులను అలరించడానికి మూఢ సినిమా సిద్ధంగా ఉన్నాయి. రేపు సిరా సినిమా విడుదల కాగా, ధనుష్ నటించిన అసురన్ సినిమాను, జీవి ప్రకాష్ నటించిన 100% లవ్ రీమేక్ 100% కాదల్ సినిమా ఈ నెల 4 న రిలీజ్ కాబోతున్నాయని సినీ యూనిట్లో వార్తలు వినపడుతున్నాయి. 


ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్న సినిమా సైరా కోసం చిరు అన్ని ప్రాంతాలకు వెళ్లి సినిమా ప్రమోషన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ అయినా పోస్టర్లు, ట్రాలర్లు తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చిరంజీవితో పాటుగా అన్ని ఇండస్ట్రీల సినీ తారలు ఇందులో నటించడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే 100%  కాదల్ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. 


ధనుష్  నటిస్తున్న అసురన్ సినిమా కూడా అందరిని ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఈ సినిమాలో ధనుష్ విభిన్న పాత్రల్లో నటించడమే అందుకు ప్లస్ అని అంటున్నారు. ఈ సినిమా 4న రిలీజ్ కానుంది. ఎటు చూసిన కూడా ఈ వారంలో విడుదల కానున్న ఈ మూడు సినిమాలు లతో ప్రేక్షకులకు కన్నుల పండుగనే చెప్పాలి. మరి ఏ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: