టాప్ హీరోల సినిమాలను భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లు పెట్టుబడిని మొదటివారంలో రాబట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ‘సైరా’ విషయంలో కూడ అదే జరుగుతోంది. ఈ మూవీకి ఉన్న మ్యానియా రీత్యా ఆంధ్రప్రదేశ్ లోని కీలక పట్టణాలలో ఈ మూవీ ప్రీమియర్ షోలు అదనపు షోలు వేసి మొదటిరోజునే ఈ మూవీకి భారీ కలక్షన్స్ ను తెచ్చుకోవాలని ‘సైరా’ బయ్యర్లు ఈ మూవీకి సంబంధించి అదనపు షోల కోసం ప్రీమియర్ షోల కోసం ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇక ఈ మూవీ విడుదలకు కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నా ప్రీమియర్ షోలకు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతులు రాలేదని తెలుస్తోంది. 

వాస్తవానికి మెగా ఫ్యాన్స్ అందరూ చాలాచోట్ల మూడురోజుల కిందటే అలవాటు ప్రకారం బెనిఫిట్ షోలకు డబ్బులు కట్టేసారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇంకా అనుమతులు రాకపోవడంతో ఈ పరిస్థితి చూసి కొన్నిచోట్ల బయ్యర్లు ఫ్యాన్స్ డబ్బులు వెనక్కు తిరిగి ఇచ్చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. 

దీనికితోడు ఈ స్పెషల్ షోలు వల్ల టిక్కెట్ కు నాలుగు నుంచి అయిదు వందల రేటు వస్తుందని ఆశలు పెట్టుకున్న బయ్యర్లు కలలు నెరవేరకపోవడంతో ఈ మూవీ ఓపెనింగ్ కలక్షన్స్ ద్వారా వచ్చే ఆదాయం కనీసం 10శాతం వరకు తగ్గిపోతుందని అంచనాలు వేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో టాప్ హీరోల సినిమాలకు సంబంధించి స్పెషల్ షోలు అదనపు షోలు వేసే విషయంలో ఇప్పటి వరకు ఇలాంటి సమస్యలు ఆఖరి నిముషంలో ఏర్పడలేదు అని అంటున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక మంత్రి ‘సైరా’ స్పెషల్ షోల అనుమతులకోసం గట్టిగా ప్రయత్నిస్తున్న పరిస్థితులలో ఆఖరి నిముషంలో ‘సైరా’ స్పెషల్ షోలకు ప్రీమియర్ షోలకు అనుమతులు వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. వాస్తవానికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కు ప్రస్తుతం ఆరోగ్యం బాగా లేకపోయినా రకరకాల ట్వీట్ లతో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ వైకాపా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉండటంతో ‘సైరా’ కు ఈ ఆఖరి నిముషం సమస్యలు ఏర్పడి ఉంటాయి అని మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. దీనితో ‘సైరా’ బయ్యర్లలో విపరీతమైన టెన్షన్ కొనసాగుతున్నట్లు సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: