టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక్కో మెట్టు ఎక్కి తమకు ఎదురు లేదనిపించుకుంటున్న ఎన్టీఆర్,ఏఎన్ఆర్ లతో పోటీ పడే హీరోలు అప్పట్లో చాలా తక్కువ మంది ఉన్నారు.  కృష్ణ, శోభన్ బాబు ఇలా మరికొంత మంది హీరోలు మంచి ఫామ్ లో ఉండగా.. ప్రాణం ఖరీదు సినిమాతో గుంపులో గోవిందం లా కనిపించాడు మెగాస్టార్ చిరంజీవి.  ఆ తర్వాత పునాధిరాళ్లు సినిమాలో కూడా చిన్న పాత్రలో కనిపించిన చిరంజీవి ఫిజిక్, చురుకుతనం చూసిన కొంత మంది దర్శక, నిర్మాతలు ఆయకు మొదట విలన్ పాత్రలు ఇచ్చారు. 

విలన్ గా తన సత్తా ఏంటో చూపించిన చిరంజీవి తర్వాత హీరోగా మారారు. ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1,116 రూపాయలు. మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న విలన్ నటించిన చిరంజీవి తర్వాత హీరోగా మారి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా నిలద్రొక్కుకున్నాడు. ఇంకా చంటబ్బాయ్,ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొందగా, గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలమయిన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.  చిరంజీవి సినీ ప్రస్థానం ఇప్పటికీ నలభైఏళ్లు దాటింది.  ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కుతుంది.  ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.  రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి మరియు చిత్ర యూనిట్ బిజీ బిజీగా ఉన్నారు.  అయితే ఈ మూవీ టీజర్, ట్రైలర్ చాలా హైలెట్ గా ఉన్నాయని... హిట్ టాక్ తెచ్చుకొని బడ్జెట్ భర్తీ చేస్తుందా లేదా చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: