తెలుగురాష్ట్రాలకు సంబంధించి రేపువిడుదల కాబోతున్న ‘సైరా’ మ్యానియా ముందు బాలీవుడ్ మూవీ ‘వార్’ ఏ రేంజ్ లోను నిలబడలేదు. అయినా ఈమూవీ ‘సైరా’ కు ధియేటర్ల విషయంలో మన తెలుగురాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక ప్రాంతాలలో కూడ ఊహించని విధంగా చెక్ పెట్టింది అని వార్తలు వస్తున్నాయి.  

ముఖ్యంగా నైజాం ప్రాంతంలో సింగిల్ స్క్రీన్స్ విషయంలో ‘సైరా’ తన ఆధిపత్యం ప్రదర్శిస్తున్నప్పటికీ మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ విషయంలో ‘వార్’ చెప్పుకోతగ్గ స్థాయిలో స్క్రీన్స్ సంపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీని నిర్మించిన యష్ రాజ్ ఫిలిమ్స్ ముందుగానే తెలుగురాష్ట్రాలలోని అనేక నగరాలకు చెందిన మల్టీ ప్లెక్స్ ధియేటర్స్ లో ఎక్కువగానే స్క్రీన్స్ సంపాధించింది అని వార్తలు వస్తున్నాయి. 

ఒక్క హైదరాబాద్ లోనే ‘వార్’ సినిమాకు సంబంధించి తొలిరోజు 2వందలకు పైగా షోలు పడుతున్నాయి అన్నవార్తలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ‘వార్’ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ కూడ చాలవేగంగా జరుగుతోంది. దీనితో ‘సైరా’ మ్యానియా అంతలేకపోయినా ‘వార్’ వల్ల ‘సైరా’ ఓపెనింగ్ కలక్షన్స్ కు ఎంతోకొంత నష్టం వస్తుంది అన్నఅంచనాలు వినిపిస్తున్నాయి. ఈట్రెండ్ నైజాం ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కీలక నగరాలైన విజయవాడ విశాఖపట్నం గుంటూరులలో కూడ కనిపిస్తున్నట్లు సమాచారం. 

బాలీవుడ్ లో అయితే ఈమూవీ పై వస్తున్న ప్రీ రిలీజ్ టాక్ చాల పాజిటివ్ గా ఉండటంతో హిందీ రాష్ట్రాలలో ‘సైరా’ కు వార్ నుండి గట్టిపోటీ తప్పదు అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈపరిస్థితుల ప్రభావంతో ‘సైరా’ పాజిటివ్ టాక్ వచ్చినా ఓపెనింగ్ కలక్షన్స్ విషయంలో దేశవ్యాప్తంగా ‘వార్’ గట్టిపోటీ ఇస్తున్న పరిస్థితులలో ఎంతోకొంత ప్రభావం ‘సైరా’ ఓపెనింగ్ కలక్షన్స్ పై ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కేరళ తమిళనాడులో కూడా వార్ పై ‘సైరా’ దే పైచేయిగా కనిపిస్తున్నా బెంగళూరు సిటీలో మాత్రం ‘సైరా’ కంటే ‘వార్’ ప్రభావం ఎక్కువగా ఉంది అని అంటున్నారు. ఈరెండు సినిమాలలో ఏసినిమాకు టోటల్ పాజిటివ్ టాక్ వస్తుంది అన్న విషయం బట్టి ఈరెండు సినిమాల మధ్య పోటీ ఫలితం ఆధారపడి ఉంటుంది అన్న అంచనాలు వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: