మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా కొన్ని గంట‌ల్లోనే థియేట‌ర్ల‌లోకి దిగిపోనుంది. చారిత్రాత్మ‌క సినిమా కావ‌డంతో పాటు రు.280 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో ప్రీమియ‌ర్లు, అద‌న‌పు షోలు ఉంటే అంత త‌ర్వ‌గా రిక‌వ‌రీ చేసుకోవ‌చ్చు. భారీ సినిమాలకు, టాప్ హీరోలకు అదనపు ఆదాయ వనరు బెనిఫిట్ షోలు లేదా అదనపు షోలు. సైరా లాంటి మెగా మూవీకి ఇప్పటి వరకు అదనపు ఆటల అనుమతి రాలేదు.


మెగా ఫ్యామిలీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌పై, వైసీపీపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేసిందో చూశాం. ఇక ఇప్పుడు వీళ్ల‌కు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర‌కు వెళ్లి అద‌న‌పు షోల‌కు అనుమ‌తులు అడిగే విష‌యంలో మొహ‌మాటాలు గ‌ట్టిగానే ఉన్నాయ‌ని తెలుస్తోంది. అంతెందుకు సోమ‌వారం సైతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస ట్వీట్ల‌తో విరుచుకుప‌డ్డారు. ఇక అద‌నపు షోల కోసం చిరుకు స‌న్నిహితుడు అయిన మంత్రి కుర‌సాల క‌న్న‌బాబుతో పాటు నిర్మాత దిల్ రాజు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.


అయితే సినిమాటోగ్ర‌ఫీ శాఖ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ద‌గ్గ‌రే ఉంది. దీంతో ఆయ‌న డెసిష‌న్ ఎలా ?  ఉంటుందో ?  చెప్ప‌లేం. ఇక ఇప్పుడు అద‌న‌పు షోల‌కు ప‌ర్మిష‌న్లు వ‌చ్చి.. టైమింగ్స్ మార్చినా మ‌రో మూడు, నాలుగు గంట‌లు ప‌డుతుంది. ఇదిలావుంటే స్పెషల్ షోలు అంటే నాలుగు నుంచి అయిదు వందల రేటు వస్తుంది టికెట్ కు. దానివల్ల బయ్యర్లకు మాంచి ఆదాయం వస్తుంది. భారీ రేట్లకు కొనడం వల్ల ఈ బెనిఫిట్ షోల వల్ల లాభం పొందుతారు. ఇలా అనుమతి రాకపోవడంతో కనీసం 10శాతం ఆదాయం తగ్గిపోతుంది.


ఈ లెక్క‌న చూస్తే సినిమాకు మ‌రీ బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ రావాలి. సినిమా రెండు, మూడు సార్లు చూసేయాల‌న్నంత టాక్ వ‌స్తేనే అంద‌రూ సేఫ్ అవుతారు. అలా కాని ప‌క్షంలో సైరా క‌లెక్షన్ల‌లో చ‌తికిల‌ప‌డ‌డం ఖాయ‌మే..!



మరింత సమాచారం తెలుసుకోండి: