మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ ప్రస్తుతం సైరా నర్సింహా రెడ్డి  ప్రమోషన్స్ లో బిజీ గా వున్నాడు.  మరి కొద్దీ గంటల్లో  ఈ సినిమా థియేటర్లలోకి వస్తుండడంతో  ప్రేక్షకులు ఎలా రిసీవ్  చేసుకుంటారోనని టెంక్షన్ పడుతున్నాడు చరణ్. సుమారు  270కోట్ల భారీ బడ్జెట్ తో తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్  లో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో  చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో చిరు తోపాటు  బాలీవుడ్  లెజండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ , కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి , కన్నడ స్టార్ హీరో   సుధీప్ ముఖ్య పాత్రల్లో నటించారు.  మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిపొందనుందనేది మరో కొద్దీ గంటల్లో తేలిపోనుంది. 



ఇక ఇదిలా ఉంటే  రామ్ చరణ్ తాజాగా   ఓ మలయాళీ సినిమా రీమేక్ హక్కులను  సొంతం చేసుకున్నాడని  టాక్ వస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన  లూసిఫర్ చిత్రం.  ఈఏడాది సమ్మర్ లో విడుదలైన ఈ చిత్రం  100కోట్ల వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది.  మాలీవుడ్ సెన్సేషనల్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన ఈ పొలిటికల్ఎంటర్టైనెర్ లో వివేక్ ఒబెరాయ్ , మంజు వారియర్ ముఖ్య పాత్రల్లో నటించారు.అయితే  ఈచిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగులోకి డబ్ చేసి  విడుదలచేయగా  ఇక్కడ మాత్రం ఎవరు పట్టించుకోలేదు. దాంతో  ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనే ఉద్దేశం తో  రామ్ చరణ్  ఈసినిమా  హక్కులను సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది. అయితే ఈ రీమేక్ లో ఎవరు హీరోగా నటిస్తారనే విషయంపై  మాత్రం  క్లారిటీ లేదు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: