తెలుగు ఇండస్ట్రీకి  అప్పటికీ.. ఇప్పటికీ...ఎప్పటికి  మకుటం లేని మహారాజు ఎవరు  అంటే...  ఇంకా ఎవరు మన మెగాస్టార్ చిరంజీవే.  ఈ మాట అనడానికి ముఖ్య నిదర్శనం  ఆయన మీద డిస్ట్రిబ్యూటర్లు పెట్టుకున్న నమ్మకమే గొప్ప ఆధారం.బారి హిట్ ఇచ్చిన ‘బాహుబలి’ తెలుగు ఇండస్ట్రీకు ఒక బార్ సెట్ చేసి పెట్టినా మిగతా స్టార్ హీరోలంతా నాన్ బాహుబలి రికార్డులు అంటూ రూ. 100 – 150 కోట్లకే అంకితం అవుతున్న నేపథ్యంలో ఆరు పదుల వయసు దాటిన మెగాస్టార్  చిరంజీవి మాత్రం ‘సైరా’తో దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ టార్గెట్ పెట్టుకుని సై.. సైరా.. అంటూ బరిలోకి వస్తున్నారు.

చిరు ఇంత పెద్ద  సాహసం చేయడానికి కారణం మరియు  తండ్రి మీద కొడుకు  రామ్ చరణ్ రూ.200 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టడానికి ముఖ్య కారణం ప్రేక్షకులకు తెలుస్తుంది. మెగాస్టార్ కెరీర్లో ఎప్పటికప్పుడు తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటూ ముందుకు కొనసాగే  శిఖరాగ్ర స్థాయిని లభించుకున్న నిత్య శ్రామికుడు చిరు. చిరు సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్లు కథ ఏమిటి, దర్శకుడు ఎవరో, బడ్జెట్ ఎంత ఉందొ అని ఆలోచించకుండా రైట్స్ కొనేవారు.

ఇప్పుడు  ‘సైరా’ చిరు హక్కుల్ని చరణ్ తండ్రి పేరు చెప్పి విపరీతమైన రేట్లకి అమ్ముకుని ఉండవచ్చు అని అంచనా. కానీ అలా కాలేదు. నాణ్యతమైన ధరలకే అమ్మారు.సినిమా థియేట్రికల్ ప్రీ లీజ్  బిజినెస్ మొత్తం రూ.250 కోట్ల వరకు ఉంటుందని అనుకుంటున్నారు అందరు. దీని ప్రకారం సినిమా రూ.300 కోట్ల వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. సంవత్సరాలు తరబడి అనుభవం, మార్కెట్ మీద పూర్తి అవగాహన ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా చిరు తప్పకుండా ఈ లక్ష్యాన్ని సాధిస్తారు అని ధీమా చేస్తున్నారు.

డిస్ట్రిబ్యూటర్లు అంత  ధీమాగా ఉండటానికి ముఖ్య  కారణం ఏమిటి అంటే మళ్లీ సేమ్ సమాధానం.. అదే మెగాస్టార్ చిరంజీవి. ఇన్ని సంవత్సరాల పాటు చిరంజీవి ప్రతి సినిమా ముందు కంచుకోటలా నిలబడి నమ్ముకున్న ప్రతి ఒక్కరినీ విజయతీరాలకు చేరుస్తూ వచ్చిన చిరు ఈ సినిమా విషయంలో కూడా చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధిస్తారు అని  తెలుగు ప్రజలు  ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇక అభిమానులు, ప్రేక్షకులు మాత్రం  సినిమా విషయంలో ఎలాంటి కొంచం కూడా  అనుమానం లేదు.. అక్కడ ఉన్నది స్టార్ కాదు.. మెగాస్టార్ అంటూ ఈజీగా వెల్లడిస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: