చిరంజీవి సినీ జీవితంలోనే ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో  తెరకెక్కుతున్న సినిమా సైరా నరసింహారెడ్డి.  ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సినిమాని నిర్మించారు. అయితే ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ చూశాక ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి ఈ సినిమాలో చిరంజీవి నటన,  ఆయన చెప్పిన డైలాగులు అన్నీ ప్రేక్షకుల మనసును  తాకుతున్నాయి ఈ చరిత్రలో మనం ఉండకపోవచ్చు అంటూ చిరంజీవి చెబుతున్న ఒక్కో  డైలాగ్ అందరిని కట్టిపడేస్తుంది.

 

 

 

 

 స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని జాతిపిత స్వతంత్ర సమరయోధుడు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రేపు విడుదల చేయబోతున్నారు. ఒక్క తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా వివిధ ఇండస్ట్రీలలో అందరి చూపు సైరా పైనే  ఉంది. ఒక్కటే ఎన్నో వివాదాలు దాటుకుని మరీ రేపు విడుదలకు సిద్ధమైంది  ఈ సినిమా.  చిరంజీవి కెరీర్ లోనే మొదటి చారిత్రాత్మక చిత్రం కావడం... భారీ బడ్జెట్ సినిమా కావడం...  ఇందులో  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్...వివిధ ఇండస్ట్రీ ల హీరోలు  సినిమాలో నటించడంతో ఈ సినిమా విడుదల కోసం అన్ని ఇండస్ట్రీలు  ఎదురు చూస్తున్నాయి. అయితే ఒక తెలుగు స్వతంత్ర సమరయోధుడి  జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రజల గౌరవాన్ని తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందా  అనేది ప్రస్తుతం నెలకొన్న ప్రశ్న.

 

 

 

 బాహుబలి ప్రపంచవ్యాప్త విజయం తర్వాత టాలీవుడ్ సత్తా ప్రపంచ నలుమూలలకు వెళ్ళింది. అయితే ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా విడుదల అవుతున్న ఈ సినిమా టాలీవుడ్ రేంజ్ ని  ఇంకొంచెం పెంచగలదా లేదా  అనేది అందరూ ఆలోచిస్తున్నారు.  ప్రతిష్టాత్మకంగా విడుదలవుతున్న సైరా నరసింహారెడ్డి మూవీ ఎంత వరకు టాలీవుడ్ సత్తా చాటుతుందో  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: