చిరంజీవి నట ప్రస్థానంలో సైరా నరసింహారెడ్డి ఓ మైల్ స్టోన్ గా నిలబడుతుందనడంతో ఎలాంటి సందేహం లేదనే టాక్ టాలీవుడ్ నుంచి గట్టిగా వినిపిస్తోంది. తన సినీ కెరీర్ లో మెగాస్టార్ తొలిసారి ఒక చారిత్రక నేపథ్యమున్న సినిమా చేయడం మెగా ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఈ మూవీలో స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఎలా ఒదిగిపోయాడనేది చిత్రంలోని ట్రైలర్ చూస్తే సగటు ప్రేక్షకుడికి ఇట్లే అర్థమైపోతోంది. 


‘సైరా నరసింహారెడ్డి’ మరో హైలెట్ ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ షెహెన్ షా, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించడం. అంతేకాదు కన్నడ స్టార్ హీరో సుదీప్, తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి నటించడం చిరంజీవి తొలిసారి నటించడం మూవీకే పెద్ద హైలెట్. పాతికేళ్లపాటు టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న జగపతి బాబు తనకు అప్పగించిన పాత్రను ఎలా మెప్పిస్తాడో అందరికీ తెలిసిన విషయమే. ఇక దక్షిణాది అందాల భామ నయనతారతో చిరు తొలిసారి వెండితెర పంచుకుంటున్నారు. మరోవైపు చిరంజీవి పుత్రుడు రామ్ చరణ్ తో ఆడిపాడిన తమన్నా చిరంజీవితో మొదటి సారి జతకట్టడంపై సినీ అభిమానుల్లో ఆశలు రెట్టింపయ్యాయి. ఎందుకంటే బాహుబలిలో ప్రభాస్ సరసన ఆమె యాక్టింగ్ ఆ చిత్రానికే హైలెట్ అయింది. ఇందులోనూ అదే కొనసాగుతుందని చిరు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. 


సైరా నరసింహా రెడ్డి పాత్రలో జీవిస్తున్న చిరంజీవి వెనుక పదివేల మంది సైన్యం ఉండబోతోందట. ఆయన బ్రిటీష్ ప్రభుత్వాన్ని భయపెట్టే తీరు ప్రేక్షక లోకాన్ని ఉప్పొంగేలా చేస్తుందట.  మరోవైపు పవన్ కళ్యాణ్ వాయిస్ కూడా సైరాకు ఓ హైలెట్ గా చెప్పుకోవచ్చు. భారీ బడ్జెట్‌తో వస్తోన్న సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని వెండితెరపై ఎపుడు చూస్తామా అని సినీ లోకం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి క్లైమాక్స్ సీన్ పై ఇప్పటికే స్పందించాడు. ఆ సీన్ చూసిన ప్రతీసారి తన హృదయం ఉప్పొంగిందని చెప్పడంతో సైరా నరసింహారెడ్డిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంతమంది మహామహులతో వస్తున్న సైరా.. డాక్యుమెంటరీ ఫిల్మ్ ఎందుకవుతుంది..? అది ఖచ్చితంగా ఓ సెన్సేషన్ చిత్రమే అవుతుందనే టాక్ వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: