ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సైరా సైరా ఇదే మాట వినిపిస్తోంది.  సైరా సినిమాకోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఇండియన్ స్టార్స్.. హాలీవుడ్ టెక్నిషియన్స్ తో కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఆసక్తికరంగా మారింది.  ఇందులోని ప్రతి పాత్రకు ఒక ప్రాముఖ్యత ఉండటం విశేషం. మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న మెగాస్టార్ పాత్రను తీర్చిదిద్దిన తీరు అమోఘం అని చెప్పొచ్చు.  అంతేకాదు, ఆ పాత్రకోసం చేసిన పరిశోధన కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.  


ఒక్క మెగాస్టార్ పాత్ర మాత్రమే కాదు, ఇందులో మెగాస్టార్ గురువుగా నటించిన అమితాబ్ పాత్రను తీర్చిదిద్దిన తీరు అద్బుతం అని చెప్పొచ్చు.  అమితాబ్ పాత్ర కొద్దిసేపు పాత్రమే ఉంటుంది.  కానీ, ఆ కొద్దిసేపటిలోనే అమితాబ్ ఆకట్టుకుంటాడట.  ఇక కిచ్చ సుదీప్ పాత్ర మరిచిపోలేనిది.  సుదీప్ పాత్ర సినిమాలో ఓ కీలకం.  అటు విజయ్ సేతుపతి పాత్ర సైతం సినిమాకు ప్లస్ అవుతుంది.  


మెగాస్టార్ సతీమణిగా చేసిన నయనతార అందరికి గుర్తుండిపోయే విధంగా నటించిందని అంటున్నారు.  తమన్నా కెరీర్లోనే బెస్ట్ పెరఫార్మన్స్ చేసినట్టు సమాచారం.  నయనతార సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనకవడంతో ఆమెపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.  నయనతార ఈ విషయంలో ముందుగానే ప్రమోషన్స్ లో పాల్గొనబోనని చెప్పింది. దానికి యూనిట్ ఒప్పుకొనే ఆమెను తీసుకున్నారు.  ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవుతుంది అనుకున్నా ఆమె హాజరు కాకపోవడం విశేషం.  


ఇదిలా ఉంటె, ఇందులో మరోపాత్రను చేసిన తమన్నాకు మంచి పేరు వచ్చింది.  ఆమె నటనను మెగాస్టార్ మెచ్చుకున్నారు.  వీరోచితమైన ఆ పాత్రలో తమన్నా మెప్పించింది.  కాగా, ఇందులో మరో కీలక పాత్రలో అనుష్క నటించింది.  క్లైమాక్స్ లో ఈ పాత్రను రివీల్ చేస్తారట.  సైరా మరణం తరువాత ఆ స్పూర్తితో అనుష్క ఝాన్సీ లక్ష్మి భాయి పాత్రలో కనిపిస్తుంది.  స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటుంది.  ఈ పాత్ర పవర్ఫుల్ గా ఉంటుందని ప్రతి ఒక్కరిని అలరిస్తుందని అంటున్నారు.  ఆ పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయాలను మాత్రం రివీల్ చేయకపోవడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: