సైరా రేపు ఉదయం రిలీజ్ కాబోతున్నది.  ఈరోజు నైట్ యూఎస్ లో ప్రీమియర్ షోలు వేయబోతున్నారు.  రేపు ఉదయం 8 గంటల నుంచి స్పెషల్ షోలు తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో వేయబోతున్నారు.  ముఖ్యంగా తెలుగు రాష్ట్రల్లోనూ అటు, తమిళనాడు చెన్నైలోని అత్యధిక షోలు వేయబోతున్నారు.  చెన్నైలో తెలుగు ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో ఉన్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.  


శాటిలైట్ రైట్స్ ను జెమిని సంస్థ సొంతం చేసుకుంది.  దాదాపు రూ.25కోట్లకు పైగా వెచ్చింది సొంతం చేసుకుంది.  అయితే, డిజిటల్ రైట్స్ ను మాత్రం జెమినికి ఇవ్వలేదు.  అమెజాన్ ప్రైమ్ ఈ రైట్స్ ను సొంతం చేసుకుంది.  అన్ని భాషల్లో కలిపి దాదాపు అమెజాన్ రూ.50 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.  ఈ స్థాయిలో డిజిటల్ రైట్స్ సొంతం చేసుకోవడం మెగాస్టార్ కెరీర్లోనే ఇదే మొదటిసారి. మొత్తంగా శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్ని భాషల్లో కలుపుకొని దాదాపు రూ. 150 కోట్ల వరకు వచ్చాయని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది.  


ఇదిలా ఉంటె సినిమా రిలీజ్ విషయంలో కూడా సైరా పోటీ పడుతున్నది. సైరాను ప్రపంచ వ్యాప్తంగా 4620 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో 1200 థియేటర్లలో సినిమా రిలీజ్ కాబోతున్నది.  అలానే కర్ణాటకలో 340, తమిళనాడులో 350, కేరళలో 130, బాలీవుడ్ ఓవర్సీస్ లో కలిపి మొత్తంగా దాదాపు 4620 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారట. 


అయితే, ఇది బాహుబలి, సాహో సినిమాల థియేటర్ల కంటే తక్కువ అనే చెప్పాలి.  బాబుబలి, సాహో సినిమాలను 9000 థియేటర్లలో రిలీజ్ చేశారు.  కానీ, సైరా కేవలం 4620 థియేటర్లలో మాత్రమే రిలీజ్ అవుతుండటం విశేషం.  అందుకే సినిమాకు డిమాండ్ పెరిగింది.  సినిమా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.  సినిమా టాక్ ఏంటి.. ఎలా ఉంది అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: