తెలుగు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి స్టార్ స్టేటస్ గురంచి భారతీయ సినిమాలపై అవగాహన ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆయన సినిమాల ఘన విజయాలు, ఆయన సాధించిన రికార్డులు దశదిశలో హోరెత్తించాయి. తెలుగుతో పాటు కన్నడలో కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ సైరా దక్షిణాది భాషలన్నింటిలో భారీగా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఇటివలే కేరళలో సైరా ప్రమోషన్ నిర్వహించారు. దీనికి మంచి స్పందన వచ్చింది. కేరళ క్రికెటర్, స్పీడ్ స్టర్ శ్రీశాంత్ ఈ సినిమాపై, చిరంజీవిపై స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.



క్రికెట‌ర్ శ్రీశాంత్ సైరా సినిమాపై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ``సైరా టీజ‌ర్‌, ట్రైల‌ర్స్ చూశాను. `బాహుబ‌లి` క‌న్నా పెద్ద సినిమాగా అనిపిస్తుంది. రిలీజ్ రోజున కానీ, రిలీజ్ త‌ర్వాత కానీ ఈ సినిమాను త‌ప్ప‌కుండా చూస్తాను. చిరంజీవి గారికి నేను పెద్ద అభిమానిని. హైద‌రాబాద్‌లో ఓ మ్యాచ్ ఆడుతున్న సంద‌ర్భంలో చిరంజీవి సార్‌ని క‌లుసుకున్నాను. క్రికెట్‌లో స‌చిన్ ఎలాగో.. సినిమాల్లో ర‌జ‌నీ సార్‌, చిరంజీవి సార్ లెజెండ్స్‌`` అని చిరంజీవిపై  తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. మళయాళంలో చిరంజీవి నటించిన ఘరానామొగుడు అప్పట్లో సూపర్ హిట్. పలు సినిమాలు మళయాళంలోకి డబ్ అయ్యాయి కూడా. సైరా.. కు మళయాళ వెర్షన్ లో సూపర్ స్టార్ మోహన్ లాల్ వాయిసి ఓవర్ కూడా ఇచ్చారు.



తెలుగులో ఫ్లాప్ అయిన రిక్షావోడు కన్నడలో సూపర్ హిట్ అయింది. తమిళ్ లో ముఖ్యంగా చెన్నైలో చిరంజీవి సినిమాలకు క్రేజ్ ఉంటుంది. బాలీవుడ్ లో చిరంజీవి పాతికేళ్ల క్రితం చేసిన మూడు హిందీ సినిమాలే ఇప్పటికీ అక్కడి ప్రేక్షకులకు గుర్తు పెట్టుకునేలా చేశాయి. దేశవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: