మెగాస్టార్ చిరంజీవి  ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సైరా.. ఈ సినిమాకు మెగా వారసుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ధృవ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. అనుష్క, తమన్నా, అమితాబ్, జగపతి బాబు, సుధీప్, విజయ్ సేతుపతి వంటి పెద్ద స్టార్స్ ఈ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించారు. 


ఒక సినిమా హిట్ అవ్వాలంటే చక్కని సంగీతం, కమ్మని గొంతుతో సాగిన పాటలు ఇవి కూడా ఉంటేనే ఈ సినిమా హిట్ అవుతుంది.  అలాంటిది ఈ సినిమాకు అమిత్ త్రివేది చక్కటి సంగీతాన్ని అందించాడు. స్వాతంత్ర సమరయోధుడు.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. చరిత్రకారులు అలాంటి పోరాటాలు మళ్ళీ చరిత్రను కళ్ళకు కట్టినట్లు చూపించేలా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా రిలీజ్ కావడానికి మరి కొద్దీ గంటలు మాత్రమే ఉంది. 



ఇకపోతే సైరా సినిమా హిట్ పక్క అని సినీ ఇండస్ట్రీ మొత్తం కోడై కూస్తుంది. గతంలో వచ్చిన బాహుబలి రికార్డులను ఈ సినిమా తుడిచి పెట్టేసింది అని వేరేలా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా మాములుగా జనాలను ఆకట్టుకోలేదు.. చిరంజీవి జీవితం సార్ధకం అయిందని చిరు వెల్లడించారు. మరో విషయమేంటంటే ఏ సినిమా అయితే లెట్ గా నిర్మింపబడుతుందో ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని మరోసారి నిరూపితం అయింది. గతంలో బాహుబలి ఆ స్థానాన్ని సాధించుకుంది. ఇప్పుడు ఆ స్థానాన్ని సైరా భర్తీచేసింది. 




కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీ లు ఒక ఎత్తైతే.. బ్రిటిష్ పాలనలో దేశం యెక్క పరిపాలన ఎలా ఉంటుందో ఇలాంటి విషయాలు కళ్ళకు కట్టినట్లు చిత్ర దర్శకుడు చిత్రీకరించారు. ఆ సినిమాలోని కొన్ని సన్నీ వేశాలు అందరిని అలరిస్తాయని అంటున్నారు. బాహుబలి యుద్ధం అమ్మ కోసం అమ్మకిచ్చిన మాట కోసం చేస్తే ఈ చిత్రంలోని సన్నివేశాలు దేశాన్ని బ్రిటిష్ పాలన నుండి కాపాడటానికి కంకణం కట్టుకున్న సమరయోధులు అందరు యుద్దాలు చేసి దేశాన్ని కాపాడతారు. ఆ పోరాటాలు అన్ని 2.54 గంటల నిమిషాలు ఈ సినిమా ఉంటుంది.. సినిమాకు హిట్ టాక్ వస్తే సినిమా కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: