టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా మంచి ఫామ్ లో కొనసాగుతున్న హీరో నాని ఈ సంవత్సరం ‘జర్సీ’తో మంచి విజయం అందుకున్నాడు. ఈ మూవీ మంచి హిట్ అయినా..భారీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది.  అంతకు ముందు కృష్ణార్జునయుద్దం, దేవదాస్ తో యావరేజ్ టాక్ తెచ్చుకున్న నాని ‘జర్సీ’లాంటి హిట్ వచ్చినా నిరాశలోనే ఉన్నారట.  అదే సమయంలో మనం ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో ‘గ్యాంగ్ లీడర్ ’ మూవీకి కమిట్ అయ్యారు.

ఈ మద్య రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ ఫస్ట్ డే హిట్ టాక్ తెచ్చుకుంది.  దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి..కలెక్షన్లు బాగానే రాబడుతుందని భావించారు.  కానీ ఇంతలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’(వాల్మీకి) మూవీ రిలీజ్ అయిన హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో నాని ‘గ్యాంగ్ లీడర్’ కి పెద్ద దెబ్బే తగిలింది.

ఈ నేపథ్యంలో కలెక్షన్ల పై కూడా భారీ ప్రభావం పడింది. మొత్తంగా 28 కోట్లకి బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా, 30 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయింది. 17 రోజుల్లో ఈ సినిమా 40 కోట్ల గ్రాస్ ను .. 23 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేసింది. వసూళ్ల పరంగా చూసినా ఇది యావరేజ్ సినిమానే అని చెప్పుకుంటున్నారు. ఒక మంచి హిట్ నాని చేతివరకూ వచ్చి జారిపోయిందనే అనుకుంటున్నారు. నానీ తదుపరి మూవీగా 'వి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: