పిల్లలకు పేర్లు పెట్టాలంటే పుట్టక ముందు నుండే ప్లాన్ చేస్తుంటారు తల్లిదండ్రులు. పుట్టిన కొద్ది కాలంలోనే ఆ వేడుకను ఘనంగా చేసి మురిసి పోతారు.   అయితే తమ కూతురుకు హీరో సాయి ధరమ్‌ తేజ్‌తో పేరు పెట్టించేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది నెలల పాటు  నిరీక్షించాడు ఓ అభిమాని. చివరకు అనుకున్నది సాదించాడు.  

అభిమానుల్లో మెగా ఫ్యాన్స్‌ ప్రత్యేకమన్నది వేరే చెప్పాల్సిన పనిలేదు.  మెగా హీరోల పుట్టిన రోజు సందర్భంగా రక్త దానాలు, పాలాభిషేకాలు చేస్తుంటారు. గతంలో ఓ అభిమాని.. చిరంజీవి ఫోటోను పెట్టుకుని పెళ్లి చేసుకుంటే, మరో అభిమాని తమ కూతురుకు పేరు పెట్టాలని చిరంజీవిని కోరారు.  ఇలా మెగా  అభిమానులు తమ ఆరాధ్య దైవం గా భావించే హీరోలపై  ప్రేమను కనబరుస్తూ అభిమానులు తమ ఇంట్లోని వేడుకకు కూడా హీరోలు హాజరు కావాలని ఆకాంక్షిస్తూ ఉంటారు . అదే విధంగా తమ కూతురుకు నామకరణం చేయాల్సిందిగా ఓ అభిమాని మెగా హీరో  సాయి ధరమ్‌ తేజ్‌ కోరాడు.

చివరకు సుప్రీం హీరో సాయి ధరమ్‌తేజ్‌  ఆ అభిమాని కోరికను తీర్చాడు. స్వయంగా ఆ వేడుకకు వెళ్లి మెగా ఫ్యామిలీకి కలిసి వచ్చే తేజ్‌ అనే పదాన్ని జోడిస్తూ.. తేజన్విత అనే చక్కని పేరును పెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. గతంలోనూ ఓ సంగీత దర్శకుడు రోడ్డుపై గాయపడితే తేజ్ స్పందించి హాస్పిటల్‌కు చేర్చడం అభిమానుల మనసుని గెలిచింది. 

తాజాగా అభిమాని కోరిక తీర్చడంపై కూడా మెగా అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన  చిత్రలహరి సినిమాతో మళ్ళి  హిట్‌ట్రాక్‌లోకి వచ్చిన సాయి ధరమ్‌ తేజ్‌.. కథలను ఎంచుకునే పద్దతి మార్చుకున్నట్లు తెలుస్తుంది.  మాస్‌ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ మెగాహీరో ప్రస్తుతం క్లాస్‌/మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే పని లో పడ్డాడు. ఈ హీరో ప్రస్తుతం మారుతి దర్శకత్వం ప్రతిరోజూ పండగే అనే మూవీని చేస్తున్నాడు. రీసెంట్‌గా విడుదల చేసిన ప్రోమో కూడా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: