పాన్ ఇండియా చిత్రం `సైరా-నరసింహారెడ్డి`కి  బాలీవుడ్ యాక్షన్ మూవీ `వార్` రూపంలో ఠఫ్ కాంపిటీషన్ ఎదురవుతుంటే మరో హాలీవుడ్ మూవీ కూడా టఫ్ కంపిటీషన్ ఇవ్వబోతుంది. హృతిక్ రోషన్- టైగర్ ష్రాఫ్ లాంటి ట్యాలెంటెడ్ స్టార్లు నటించిన 'వార్' చిత్రం అటు ఉత్తరాదిన.. ఇటు దక్షిణాదిన భారీగా రిలీజవుతోంది.  ఆస్కార్ రేంజు హాలీవుడ్ క్రేజీ మూవీ `జోకర్` మెట్రో నగరాల్లో అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. 

సైరా నరసింహ రెడ్డి 1800ల నాటి వీరుడి కథ ఐతే..... అసలు జోకర్ అనే పాత్రకు చాలా పెద్ద హిస్టరీ ఉంది. రేనాటి సూరీడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ సైరా ఐతే ....క్లాసిక్ డేస్ కామిక్ బుక్ నుంచి.. బ్యాట్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ నుంచి పుట్టుకొచ్చిన గొప్ప పాత్ర జోకర్ ది. దీనిపై ఇప్పటికే పలు ఫీచర్ ఫిలిమ్స్ ని ప్రఖ్యాత డీసీ సంస్థ నిర్మించింది. హిత్ లెజర్ అనే హాలీవుడ్ నటుడు బ్యాట్ మ్యాన్ (డార్క్ నైట్) సిరీస్ లో జోకర్ పాత్రలో నటించాడు.

అతడు చనిపోయిన తర్వాత చాలామంది ఈ పాత్రలో మెప్పించేందుకు ప్రత్నించినా సఫలం కాలేదు. తాజాగా డీసీ సంస్థ తెరకెక్కించిన లేటెస్ట్ జోకర్ చిత్రంలో జాన్విన్ ఫోనిక్స్ నటనకు గొప్ప గుర్తింపు దక్కుతోంది. 1970-80ల తరహాలో క్లాసిక్ క్యారెక్టర్ లో ఫోనిక్స్ నటన రక్తి కట్టిస్తోంది. కామిక్ బుక్ మైథాలజీ నుంచి సపరేట్ చేయబడిన ఒక పాత్ర నుంచి పుట్టిన మూవీకి ఫిలిప్స్ దర్శకత్వం వహించారు.

బ్యాట్ మ్యాన్ సిరీస్ విలన్ కి కొనసాగింపు పాత్రతో రూపొందించిన సినిమా కాబట్టి ఆ సిరీస్ అభిమానులు థియేటర్లకు పోటెత్తడం ఖాయం అని అంచనా వేస్తున్నారు.  దాదాపు 390 కోట్ల (5.5 కోట్ల అమెరికా డాలర్లు) బడ్జెట్ తో నిర్మించిన జోకర్  2020 ఆస్కార్ బరిలో అవార్డు ఖాయమని ఫిలింక్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.
ఇది మరి మెగా అభిమానులను ఒకింత ఆందోళన కలిగించే విషయమే  


మరింత సమాచారం తెలుసుకోండి: