సైరా ప్యాన్ ఇండియా మూవీ అని గ్రాండియర్   గా రిలీజ్ చేశారు. బాలీవుడ్లో ఎక్కువ ధియేటర్లను కూడా తీసుకున్నారు. చిరంజీవికి బాలీవుడ్లో దశాబ్దాల  తరువాత ఓ సినిమా హాల్లో పోస్టర్ పడుతోంది. ఆయనకు బాలీవుడ్లో ఇప్పటికైతే ఫ్లాప్స్ ఉన్నాయి. చేసిన రెండు సినిమాలు బ్యాడ్ రిజల్ట్ నే మిగిల్చాయి. ఇపుడు సైరా మూవీతో  ఈ వయసులో మెగాస్టార్ బాలీవుడ్ మీద గురి పెట్టాడు.


అయితే బాలీవుడ్లో బాక్సాఫీస్ షేక్ చేయడం అంత ఈజీ కాదని అంటున్నారు. మరో వైపు వార్ మూవీ కూడా పోటీగా ఉంది. ఇక చిరంజీవి టాలీవుడ్ వరకూ చూసుకుంటే మెగాస్టార్. ఆయన ఇక్కడ దున్నేయడం ఖాయం. మెగాస్టార్ మూవీ అంటే ఒకసారి అయినా చూసేయాలని అంతా అనుకుంటారు. పైగా దసరా సెలవులు ఉన్నాయి.


వారం రోజుల పాటు అదనపు షోలకు కూడా అనుమతులు వచ్చాయి. టికెట్లు రేట్లు పెంచుకుని మరీ కుమ్మెయవచ్చు. మొత్తం మీద చూసుకుంటే టాలీవుడ్ వరకూ సైరా హిట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక పోతే బాహుబలి రికార్డులు కొడుతుందా అంటే అది కొంత సందేహమే. బాహుబలి సీజన్ వేరు, దాని కధ వేరు. దాని మార్కెటింగ్ స్ట్రాటజీ వేరు. 


సైరా మూవీ జోనర్ వేరు. చిరంజీవి లాంటి నటుడు చేస్తున్న ప్రయోగం ఇది ఆయన్ని ఈ గెటప్ లో హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ ఎపుడూ చూడలేదు. ఓ విధంగా మెగా డ్యాన్సులు, ఫైట్లు, స్టెప్పులు లేని మూవీ ఇది. దానికి తోడు డ్రై సబ్జెక్ట్. ఎవరికీ  తెలియని ఒక యోధుడి కధ. అందువల్ల ఈ మూవీని ఒకసారి గ్యారంటీగా చూసే వారు పదే పదే చూడడం మాత్రం కష్టం.


ఏది ఏమైనా టాలీవుడ్ కి అసలైన దసరా పండుగా సైరా సినిమా అన్నదాంట్లో సందేహం లేదు. బాలీవుడ్, ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్లు రాబడితే మాత్రం చిరంజీవి కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: