సైరా నరసింహారెడ్డి.. సై సై రా... అనే డైలాగ్  సినిమాలో చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.  ఆ డైలాగ్ తో గూస్ బమ్స్ అని చెప్పాలి.  ఇందులో ఇదొక్కటే కాదు ఇలాంటి పవర్ ఫుల్ డైలాగులు ఎన్నో ఉన్నాయి.  సాయి మాధవ్ బుర్రా ఇలాంటి పదునైన డైలాగులతో ఆకట్టుకున్నాడు.  వరసగా పెద్ద సినిమాలకు ఆయన అందిస్తున్న డైలాగులు సినిమాకు ప్లస్ అవుతున్నాయి.  


ఇదిలా ఉంటె, సినిమా మొత్తానికి రిలీజ్ అయ్యింది.  యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోలు వేస్తున్నారు.  అక్కడి షోలకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నది.  థియేటర్లలో జనాలకు మెగాస్టార్ ను చూసిన ఆనందంలో ఈలలు చప్పట్లు కొడుతున్నారు.  65 ఏళ్ల వయసులో కత్తిపట్టుకొని యుద్ధం చేస్తుంటే మళ్లీ ఓ కొదమసింహం దూకుడుగా యుద్ధం చేసిన ఫీలింగ్ కలుగుతున్నది.  ఇదిలా ఉంటె, రామ్ చరణ్ సినిమా రిలీజ్ కు ఒకరోజు ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు.  


దానికి కారణం ఉన్నది.  మెగాస్టార్ లాంటి హీరోతో షూటింగ్ చేసిన సినిమా అప్పుడే పూర్తయ్యిందా అనిపించిందట.  రెండేళ్లపాటు ఈ సినిమా అందరిని కలిపిందని, అందరితో కలిసిమెలిసి ఉండే విధంగా సినిమా బంధం ఉందని, ఇప్పుడు సినిమా పూర్తవడంతో ఒకింత బాధగా ఉందని అన్నాడు.  మెగాస్టార్ కల నెరవేరబోతున్నదనందుకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు చరణ్.  సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే మెగాస్టార్ అని, సినిమా ఎలా ఉండబోతుందో అనే టెన్షన్ ఉందని అన్నారు.  


అయితే, ప్రస్తుతం అందుతున్న టాక్ ను బట్టి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది.  సినిమా హైప్ కు తగ్గట్టుగా పాజిటివ్ టాక్ తోనే నడుస్తున్నది. సినిమా ఎలా ఉన్నది ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ మరికాసేపట్లోనే వస్తాయి.  ఏపీలో కొద్దిసేపటి క్రితమే షోలు స్టార్ట్ కాగా, తెలంగాణాలో ఇంకా షోలు స్టార్ట్ కాలేదు.  సినిమాకు పూర్తిస్థాయిలో పాజిటివ్ టాక్ వస్తే.. ఫస్ట్ డే ఏ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తుందో చెప్పక్కర్లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: