మెగాస్టార్ చిరంజీవి సైరా మూవీ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.  సినిమా రిలీజ్ విషయంలో ఎక్కడ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది.  ఎలా ఉన్నది ఏంటి అనే విషయాలు మరికాసేపట్లోనే తేలిపోతాయి.  అది వేరే విషయం అనుకోండి.  అయితే, సైరా సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి రిలీజ్ కు వారం రోజుల ముందు వరకు బన్ని ఈ సినిమా గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.  


ఇటీవలే బన్నీ ఈ సినిమా గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.  మగధీర చూసిన తరువాత మెగాస్టార్ ను అలా కత్తిపట్టుకొని యుద్ధం చేసే యోధుడిగా చూడాలని అనుకున్నన్నానని ఆ కల ఇలా నెరవేరిందని, మాబావ రామ్ చరణ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారు.  అయితే, ఇన్నాళ్లు ఈ సినిమా గురించి మాట్లాడకుండా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయట. 

మెగాస్టార్ తో కలిసి ఒక్క సినిమాలోనైనా నటించాలనే కోరిక ఉందని, సైరా ద్వారా ఆ అవకాశం వస్తుందని బన్నీ అనుకున్నాడట.  కానీ, సినిమాలో తనకు రోల్ లేకపోయేసరికి పాపం బన్నీ చాలా డిజప్పాయింట్ అయ్యాడు.  రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటన అమోఘం.  ఆ సినిమాలనే తనకు కూడా ఇందులో ఓ మంచి పాత్ర దొరుకుతుందని అనుకున్నారు.  


కానీ, రోల్ రాకపోయేసరికి బన్నీ బాధపడ్డాడని, బహుశా అందుకే బన్నీకి కోపం వచ్చి అలకబూనాడని సమాచారం.  ఇందులో ఎంతమేరకు నిజం ఉండొచ్చు అన్నది వేరే విషయం అనుకోండి.  మొత్తానికి సినిమా అయితే  బాగుందని టాక్ వస్తోంది.  అనుష్క శెట్టి రోల్ గురించి, అటు ప్రగ్యా జైస్వాల్ రోల్ గురించిగాని బయటకు రాలేదు. ఈ రెండు పాత్రలు ఏంటి ఎలా ఉన్నాయి అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: