ఈరోజు రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.  అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి సైరా కాగా రెండో సినిమా వార్.  సైరా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్, మెగాస్టార్ చిరంజీవి, సుదీప్, విజయ్ సేతుపతితో పాటు నయనతార, తమన్నా, అనుష్క, జగపతి బాబు తదితరులు నటించారు.  ఈ సినిమా ప్రీమియర్ షో ఇప్పటికే ముగిసింది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  


అయితే, సినిమాకు హైప్ క్రియేట్ కావడంతో తప్పనిసరిగా ఈ మూవీ రూ. 30 నుంచి రూ. 40 కోట్ల రూపాయల వరకు మొదటిరోజు వసూళ్లు చేస్తుందని వార్తలు వస్తున్నాయి.  ట్రేడ్ వర్గాలు కూడా ఇదే విషయాన్నీ స్పష్టం చేస్తున్నాయి.  అయితే, ఈ మూవీతో పాటు బాలీవుడ్ లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లు నటిస్తున్న వార్ కూడా రిలీజ్ అవుతున్నది.  ట్రైలర్ తోనే మంచి అంచనాలు అందుకున్న ఈ సినిమా ఫస్ట్ డే రోజున బాలీవుడ్ లో రూ. 45 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.  


ఇప్పటికే ఈ సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.  ఇదే వైబ్ ను సినిమా కంటిన్యూ చేస్తే.. అమిర్ ఖాన్ హిందుస్తాన్ సినిమా కలెక్షన్లను తప్పనిసరిగా బెత చేస్తుందని అంటున్నారు.  ట్రేడ్ వర్గాలు కూడా వార్ సినిమా హిట్ డిసైడ్ చేస్తే.. బాక్సాఫీస్ కలెక్షన్ల వార్ మరోలా ఉంటుందని అంటున్నారు. ఈ రెండు వేర్వేరు సినిమాలు.  రెండింటి జానర్లు వేరు.  వార్ పూర్తిగా యాక్షన్ సినిమా.  


సాహోలా కాకుండా వార్ యాక్షన్ తో పాటు డ్రామా, ఎమోషన్ బాగుంది అంటే.. సినిమా కలెక్షన్లు పీక్స్ లో ఉంటాయి.  అందులో సందేహం అవసరం లేదు.  సినిమా ఎలా ఉంటుంది అన్నది ఈ  ఎమోషన్స్ పై ఆధారపడి ఉంటుంది.  అయితే, వస్తున్న టాక్ ప్రకారం అన్నిరకాల మసాలాలు సినిమాలో ఉన్నాయని, హృతిక్ బాలీవుడ్ మనసు దోచేశాడని, ధూమ్ 2 తరువాత తిరిగి ఆస్థాయిలో హృతిక్ ఆకట్టుకున్నాడని వార్తలు వస్తున్నాయి.  రెండు సినిమాలు బాగుంటే అంతకంటే కావాల్సింది ఏముంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: