మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి రాంచరణ్ నిర్మాణ సారధ్యం వహించారు.   బ్రిటీష్ వారిని ఎదిరించి పోరాడిన మొట్టమొదటి తెలుగు బిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరక్కించారు.  అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై మొదటి నుంచి భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.  

చిరంజీవి 41 ఏళ్ల కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇది.  ఓవర్సీస్ ఆడియన్స్ ప్రీమియర్ షోలకు సిద్ధం అవుతుంటే.. తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలోని ప్రధాన నగరాల్లోని మెగా అభిమానులు సైరా స్పెషల్ షోలకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎదురయ్యే రద్దీ, బ్లాక్ టికెట్ల నియంత్రణ కోసం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలని కొణిదెల ప్రొడక్షన్స్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖ పట్ల ఏపీ సర్కారు సానుకూలంగా స్పందించి గుడ్ న్యూస్ చెప్పింది.

ఏపీ ప్రభుత్వం సైరా మూవీ ప్రత్యేక షోలకు అనుమతినిచ్చింది. రెండు స్పెషల్ షోలతో పాటు, నాలుగు రెగ్యులర్ షోలు మొత్తం రోజుకు 6 షోలు ప్రదర్శించుకునేలా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని ప్రధాన థియేటర్స్ వద్ద అభిమానుల కోలాహలం నెలకొని ఉంది. తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటలవరకు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది. తద్వారా రద్దీ నియంత్రణ, బ్లాక్ టికెట్ల నియంత్రణ సులభతరం అవుతుందని ప్రభుత్వం కూడా అంగీకరించింది. మెగాస్టార్ మూవీ కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: