మెగా స్టార్ చిరంజీవి నటించిన మెగా మూవీ సైరా నరసింహారెడ్డి.  కొణెదల ప్రొడక్షన్ బ్యానర్ ఫై రామ్ చరణ్ నిర్మించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  తెలుగు తో పాటు తమిళ్ , హిందీ , కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతుంది. అన్ని ఏరియాల్లో ఈ సినిమా భారీ ఎత్తున థియేటర్స్ లలో సందడి చేయబోతుంది. మెగాస్టార్ చిరంజీవి దాదాపు పది సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీలో నటించాడు.  ఈ మూవీ కమర్షియల్ హిట్ తో పాటు రైతులకు సంబంధించిన మంచి మెసేజ్ కూడా చూపించారు. 


ఇక మెగాస్టార్ చిరంజీవి 151వ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. ఈ మూవీ   1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాళెగాండ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు.  వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకరు. బ్రిటీష్  కంపెనీ దొరతనము ఎదిరించి వీరమరణం పొందినాడు. 


బ్రిటీష్ వారు భారత దేశాన్ని కబలించి ఇక్కడి సంపద అంతా దోచుకు పోతున్న సమయంలో తమకు ఎదురు తిరిగిన వారిని బందిపోటు ముద్ర వేసి వారిని ఉరి తీయడం..లేదా జైళ్లో పెట్టి క్రూరంగా హింసించడం జరిగేది. బ్రిటిషు ప్రభుత్వం ఇక్కడి వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది.  


ఇక  నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామములో జన్మించి, ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాధల వలన తెలుస్తున్నది.  1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా, అక్కడి తహసిల్దార్, ఆ వ్యక్తిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది.


బ్రిటీష్ వారికి కంటిమీద కునుకు లేకుండా చేసిన నరసింహారెడ్డిని బలంతో కాకుండా కుయుక్తితో కుట్ర పన్ని  1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల వద్దగల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి ఆయన నిరాయుధుడిగా ఉన్న సమయంలో బంధించారు. నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు.  కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు.  1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని  బహిరంగంగా ఉరితీశారు.


ఆ సమయంలో విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు. ఈ కథను సైరా నరసింహారెడ్డి లో మొత్తం కమర్షియల్ గా మలచిన..కథను ఎక్కడికో తీసుకు వెళ్లారని..వాస్తవిక కథను అక్కడక్కడ చూపించారని..సైరా నరసింహారెడ్డి వాస్తవ కథ అని అలాంటి మూవీ ఓ డాక్యూమెంటరీలా మలచారని..యుద్దలు..బీభత్సాలు చూపించారని..మొత్తాని ఓ వీరుడి కథ ఆదర్శవంతంగా కాకుండా సినిమా పరంగా చూపించారని ఈ మూవీ ప్రిమియం షోలు చూసినవారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  మొత్తానికి సైరా నరసింహా రెడ్డి వాస్తవ కధే కానీ వాస్తవానికి దూరంగా ఉందంటున్న ప్రేక్షకులు ?

మరింత సమాచారం తెలుసుకోండి: