నిన్న అర్దరాత్రి 1గంట నుండి ఆంధ్రప్రదేశ్ లో ‘సైరా’ ప్రీమియర్ షోలు పడుతున్నాయి. మెగా అభిమానుల కోలాహలంతో ధియేటర్స్ లో డైలాగులు కూడ వినిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని చూసిన ఓవర్సీస్ ప్రేక్షకుల అభిప్రాయాలు కూడ బయటకు వస్తున్నాయి. 

రేనాటి వీరుడైన నరసింహా రెడ్డి గురించి ఇంతవరకు ప్రపంచానికి అంతగా తెలియకపోవడంతో ఈ కథను సినిమాలో చూసే ప్రేక్షకులకు మంచి ఆసక్తిని కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో సినిమా ప్రారంభం అవుతూ బ్రిటీష్ వారి ప్రవేశం వారి ఆగడాల గురించి చెప్తాడు. నరసింహ రెడ్డి కథలోకి తీసుకెళ్లేందుకు తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో చిన్న సర్‌ప్రైజ్‌ చేశాడు దర్శకుడు. సినిమాలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వెళ్తాడు. చిరంజీవి ఎంట్రీ మాత్రం మెగా అభిమానులకు జోష్ ను ఇచ్చే విధంగా ఉందని ఈ మూవీని చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇక ఈమూవీలో వచ్చే  ‘జాతర’ సాంగ్ తెరపై చూడటానికి రెండు కళ్ళు చాలవు అనేంత అద్భుతంగా తెరకెక్కించారు అని ఓవర్సీస్ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బోర్ కొట్టించేలా ఉన్నాయని మధ్యలో వచ్చే ఫైట్స్ కన్నులపండవగా ఉన్నాయని ఓవర్సీస్ ప్రేక్షకులు చెపుతున్న అభిప్రాయాలను బట్టి ఈ మూవీకి కూడ డివైడ్ టాక్ తప్పదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

అయితే చాలామంది ఓవర్సీస్ ప్రేక్షకులు ఈ మూవీని ఫస్ట్ హాఫ్ నిలబెడుతుందని ముఖ్యంగా ఈ మూవీలో వచ్చే ఇంటర్వెల్ సీన్ ఈ మూవీకి కీలకంగా మారడమే కాకుండా ఈ సినిమాను చూసే ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకుంటాయని చెప్తున్నారు. అదేవిధంగా ఈ మూవీలో వచ్చే ‘సైరా’ సాంగ్ తెరపై ఇంతకుముందెన్నడు చూడని విధంగా ఉందని ఓవర్సీస్ ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పాట ఈమూవీకి విజువల్ వండర్ గా మారి తీరుతుందని ఈ మూవీని చూస్తున్న ఓవర్సీస్ ప్రేక్షకులు బయటకు మెసేజ్ లు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అత్యంత కీలకం అనీ ప్రతీ సన్నివేశాన్ని గుండెకు హత్తుకునేలా చేయడంలో ఈ మూవీ బ్యాక్ స్కోర్ ఈ మూవీ స్థాయిని మరో రేంజ్ కి తీసుకు వెళ్ళిందని అంటున్నారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం ఖాయమే అయినప్పటికీ ఈ మూవీని ఒకటికి రెండు సార్లు ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేయడానికి కొంత సహనం ఉండాలి అని వస్తున్న ఓవర్సీస్ ప్రాధమిక టాక్ ను బట్టి ‘సైరా’ సూపర్ సక్సస్ అయినప్పటికీ ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసే విషయంలో ఎంత వరకు విజయం సాధిస్తుంది అన్న విషయం ఈమూవీ పై బాలీవుడ్ ప్రేక్షకులు ఇచ్చే తీర్పు పై ఆధారపడి ఉంటుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: