స్వాతంత్రోద్యమాన్ని శాంతి యుతంగా నడిపించి  ఈశతాబ్దపు స్పూర్తి దాతగా  అహింసా మార్గంతో ఎంతో మందిని ప్రభావితం చేసిన  మహాత్మా గాంధీజన్మిచి నేటితో 150 ఏళ్ళు పూర్తి అవుతున్నాయి. ‘మహాత్మగాంధీ లాంటి ఒక మనషి సజీవంగా ఈ భూమ్మీద నడయాడడు అంటే భవిష్యత్ తరాలు నమ్మడం కష్టం’ అంటూ ప్రపంచ విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ అన్నారు అంటే మహాత్ముడి గొప్పతనం గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. 

నా జీవితమే నా సందేశం అని చాటిన మహనీయుడు గాంధీజీ. అహింసాయుత మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకు రావడానికి ఆయన ఎంచుకున్న ఆయుధం అహింస. అహింసా ఉద్యమం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచింది. ఆయన ఎంచుకున్న బాట ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఒక  పాఠ్యాంశంగా మారింది.


ప్రపంచంలో వచ్చిన చాలా ఉద్యమాలు హింసతో కూడుకున్నవే ఫ్రెంచ్ విప్లవం రష్యా విప్లవం క్యూబా తిరుగుబాటు టర్కీ తిరుగుబాటు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రక్తపాత ఉద్యమాలు ఉన్నాయి. వీటన్నింటినీ చూస్తూ చదువుతూ పెరిగిన గాంధీజీ మాత్రం భారత స్వాతంత్యోద్యమానికి అహింసాయుత పోరాటాన్ని ఎంచుకున్నారు. 
గాంధీజీ అహింసా సిద్దాంతానికి దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షపై గాంధీ పోరాటం చేస్తున్న సమయంలోనే దీనికి బీజాలు పడ్డాయి. సత్యాగ్రహం అంటే సత్యం కోసం ఆగ్రహం కాదని, సత్యాన్ని దృఢంగా పట్టుకొని ఉండటమని గాంధీజీ అనేకసార్లు చెప్పారు. గాంధీజీ దృష్టిలో అహింస అంటే ప్రేమ ప్రతి వ్యక్తీ తనను ప్రేమించుకున్నట్లే ఇతరులనూ ప్రేమించాలని సూచించారు. ప్రతి హృదయంలోనూ ఏదో ఒక మూలన ప్రేమ జ్యోతి మిణుకుమిణుకుమంటూ ఉంటుంది. దాన్ని ప్రకాశింపజేయడమే సత్యాగ్రహం అని గాంధీ అభిప్రాయం. 

మహాత్మా గాంధీతో పరిచయం లేనివారు కూడా అయన జీవితంతో ప్రభావితమయ్యారు. నెల్సన్ మండేలా వంటి వారి జీవితం అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. "కృషి లేని సంపద, స్పృహ లేని ఆనందం, గుణం లేని జ్ఞానం, విలువల్లేని వ్యాపారం, మానవత్వం లేని శాస్త్రవిజ్ఞానం' 'త్యాగం లేని మతం’ వ్యర్ధం అనే ఏడూ సూత్రాల మీద గాంధీ సిద్దాంతం నిర్మింపబడింది.  ‘ప్రతి సమస్యలో ప్రతి సంక్షోభంలో పరిష్కారం కోసం నేను మహాత్ముడు వైపు చూస్తాను’ అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు అనేకసార్లు తన ఉపన్యాసాలలో చెప్పారు. ప్రపంచానికి శాంతి మంత్రాన్ని ఉపదేశించిన మహాత్మాగాంధీకి నోబెల్ శాంతి బహుమతి ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన మరణం తరువాత కూడ రాకపోవడం దురదృష్టకరం..



మరింత సమాచారం తెలుసుకోండి: