ఒక పక్క కోర్టులో కేసులు, సైరా కుటుంబ సభ్యులే తిరుగుబాటు, మరోవైపు మా పాత్రల్ని కించపరిచారంటూ మరో వివాదం. అన్నిటిని దాటుకొని..... రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాడిన యోధుడి కధ సైరా సినిమాగా ఈ రోజు ఉదయమే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.   మెగా స్టార్ చిరుకి 151వ సినిమా...  171 నిమిషాల నిడివి.... 300 కోట్ల రూపాయల బడ్జెట్.... 1857 నాటి కథ......ఒక్క 10 లైన్లలో మీక్షించాలంటే చాల కష్టం. అందుకే ఈ సినిమాకి సంబంధించి ఒక్కొక్క   హైలైట్ పాయింట్ కి రివ్యూ ఇచ్చినా తప్పులేదు. 

 అక్టోబర్ 2 ఇప్పటి వరకు ఈ తేదీ గాంధీ జయంతికి ప్రత్యేకం. కానీ ఈ రోజు నుండి మెగా సైరా డే గా అభిమానులు పిలుచుకున్నా ఆశ్చర్యం లేదు. బకింగ్ హమ్ ప్యాలెస్‌ సీన్‌తో సైరా సినిమా ప్రారంభమవుతుంది. ఆనాటి స్వాతంత్ర్య ఘట్టాలు ప్రతి భారతీయుడికి తెలిసిందెయ్ అందుకే  1857లో జరిగే సిపాయిల తిరుగుబాబు ఎపిసోడ్‌తో నేరుగా కథలోకి తీసుకెళ్లడం జరిగింది.అక్కడ కట్ చేస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్యం నాటి సీన్లతో కథలో మొదటి ఎమోషన్ ప్రేక్షకుడిని టచ్ చేస్తుంది.

నరసింహారెడ్డి తాతగా నాజర్ పాత్ర ప్రవేశిస్తుంది. ఆ క్రమంలోనే గురువు గోసాయి వెంకన్న పాత్రలో లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఎంట్రీకి హాలు దద్దరిల్లిపోతుంది.  నర్తకి లక్ష్మీగా తమన్నాకి చిరంజీవికి మధ్య నీటి లోపల ఉండే సీన్ మొదటి హైలెట్ అని చెప్పాలి. సామంత రాజుల పాత్రల్లో జగపతిబాబు, రవికిషన్, కిచ్చ సుదీప్, ముఖేష్ రుషి పాత్రలు ఇలా ఒక్కొక్కటి ఎంట్రీ ఇస్తుంటే కథ, కథనాలు సాగుతూ వెళిపోతాయి.

పోరాట నేపథ్యం అంటే యాక్షన్ సీన్లు ఉండాలి కదా ఈ సినిమాలో  ఎద్దులతో ఉండే యాక్షన్ సీన్లను దర్శకుడు సురేందర్ రెడ్డి, సినిమాటోగ్రఫర్ రత్నవేలు అద్బుతంగా తెరకెక్కించారని చెప్పాలి.రేనాడు ప్రాంతాన్ని బ్రిటీష్ ప్రభుత్వం కబ్జా చేసే ప్రయత్నాల మధ్య నరసింహారెడ్డి, లక్ష్మీ లవ్ స్టోరి చాలా సెన్సిబుల్‌గా కనిపిస్తుంది. అలాగే సిద్ధమ్మగా నయనతార పాత్ర ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నర్సింహారెడ్డి, సిద్దమ్మ పెళ్లి ఎపిసోడ్‌ తెర లేచింది. ఇంట్రడక్షన్ తోనే సైరా సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్ధం అయ్యే ఉంటుంది.మరి నెక్స్ట్ హైలైట్ ఏంటో తెలుసుకోవాలంటే మరో రివ్యూ చూడాల్సిందె. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: