ఫస్టాఫ్ అంతా విజువల్ వండర్‌గా సాగిన సైరా సినిమాకు ఆణిముత్యంగా మారిన జాగో పాట కన్నులపండువగా కనిపిస్తుంది. ఈ జాతర పాటతో పాటు సైరా టైటిల్ సాంగ్ ఫస్టాఫ్‌కు హైలైట్ గా నిలిచింది.  వేలాది మంది పోరాట వీరులతో, అద్భుత సెట్టింగులు సినిమాకు మరింత రిచ్ ఫీలింగ్ తీసుకు వచ్చింది. 
 
కథలో కీలక సన్నివేశాలు చోటుచేసుకోవడం, స్టోరి అనేక మలుపు తిరగడం, నరసింహారెడ్డిపై ప్రభావం పడడంతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై అతడి తిరుగుబాటుకు మొదలైంది.  ఇంకేముంది తెల్లదొరలపై తన యుద్ధం  ప్రకటించాడు. ఒంటరి పోరుతో బ్రిటీష్ వారికి దడపుట్టిస్తున్నాడు. చిరు యాక్షన్ సీన్స్ తో  కథ హై వోల్టేజ్‌తో వెళ్తుంటే.. స్టోరిలో ఒక ట్విస్ట్ మొదలవుతుంది.
అప్పుడే  ఓ ప్రధానమైన పాత్రతో సుదీప్ కిచ్చ ఎంట్రీ సినిమాకు ప్రాణం పోసిందనే చెప్పాలి. ఇక  సుదీప్ నటన ఈ మూవీ కి మరింత ప్లస్‌గా మారింది. 
 
మరోపక్క తమిళ పోరాట యోధుడిగా విజయ్ సేతుపతి పాత్ర పరిచయం అయింది.  'ఓ సైరా' అంటూ సాగే  పాట ప్రేక్షకుల రోమాలు నిక్కబొడిచేలా ఉంటుంది. ఈ పాటలో తమన్నా డ్యాన్స్ మరింత ఆకట్టుకొందనే చెప్పాలి. సైరాను మరో లెవెల్‌కు తీసుకెళ్లే మహా సంగ్రామం ఎపిసోడ్‌తో సినిమా మరింత ఎమోషనల్‌గా మారుతుంది. సామంత రాజులుగా  చిరంజీవితో‌పాటు కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు వార్ ఎపిసోడ్, ఆకట్టుకునేలా ఉన్నాయి.
 
ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతీ సీన్ ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేసేలా ఉంటుంది. కధలో ఇన్వాల్వ్ ఐన ప్రేక్షకులను  సైరా నర్సింహారెడ్డి ఉరికంబం ఎక్కే సీన్ ఎమోషనల్‌గా మారుస్తుంది. చివరి పది నిమిషాలు సినిమా హై వోల్జేజ్‌గాయాక్షన్ తో రసవత్తరంగా మారుతుంది. క్లైమాక్స్ 45 నిమిషాలు అయితే ఎమోషనల్‌గా చిరు స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి. క్లైమాక్స్ దేశభక్తితో పాటు కంటతడి పెట్టించే విధంగా ఉంటుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: