ఫస్ట్ హాఫ్ అంతా జమిందారుగా.. సెకండ్ హాఫ్ అంతా బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటు చేసే వీరుడిగా సైరా లో చిరు మార్కులు కొట్టేశారు. ఆరు పదుల వయసులో  మెగాస్టార్ చేసే కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు ప్రేక్షకులు చేత చప్పట్లు కొట్టించింది.ఇక అమితాబ్ గురువు పాత్రలో, జగపతి బాబు, విజయ్ సేతు పతి, సుదీప్ మిగతా తారాగణం నటించారు అనే కంటే జీవించారనే చెప్పాలి.

ఇంతమంది లెజండరీ యాక్టర్స్‌తో పనిచేయడం ఆషామాషీ వ్యవహారం కాదు... కానీ  మొత్తానికి దర్శకుడు సురేందర్ రెడ్డి.. సైరా సినిమాను బాగా హ్యాండిల్ చేశాడనే చెప్పాలి.    సెంటిమెంట్ విషయంలో కానీ.. విరోచిత సన్నివేశాలు...ఇలా ప్రతీ సన్నివేశాన్ని అత్యద్భుతంగా మలిచాడు దర్శకుడు.   ‘స్వాతంత్య్రం రాక ముందు భారతదేశం పరిస్థితి ఎలా ఉండేది... యాక్షన్ సీక్వెన్స్ లు, విజువల్స్, పాటలను చిత్రీకరించిన విధానం ఆనాటి పరిస్థితులకు అద్దం పట్టేలా చేసాడు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. ‘ఇతను పడ్డ కష్టానికి ఫలితం తెర పై చూస్తే అర్ధం అవుతుంది.

 

ఇక సైరా చిత్రంలో 4 పాటలే ఉన్నప్పటికీ వాటికి.. అద్భుతమైన మ్యూజిక్ అందించాడు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది. అయితే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం జూలియస్‌ పాకియం అందించాడు. ‘వాటర్ సీక్వెన్స్’ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లయిమాక్స్ కు ఈయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆ సీన్స్ మరింత రక్తి కట్టాయనే చెప్పాలి. 

 

తెలిసిన కధే అయినప్పటికీ ....కథ, కథనం, మ్యూజిక్, యాక్టింగ్, సహ పాత్రలు, ఇంటర్‌వెల్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా హిట్ టాక్ ని తెచ్చుకుంది. మొత్తానికి సినిమా సూపర్ హిట్.. మెగాస్టార్ కష్టానికి ఫలితం దక్కిందంటున్నారు మెగా ఫాన్స్.  సమర వీరుల కధ అంటే శాడ్ ఎండింగ్ ఏ ఉంటుంది.తెలుగు ప్రేక్షకులు ఇటువంటి ముగింపుని ఒప్పుకోరు.....  మరి ప్రేక్షకుల అభిరుచి కి తగ్గట్టు క్లైమాక్స్ ఎం చేసి ఉంటారో తెలుసుకోవాలంటే థియేటర్ కి వెళ్లి సినిమా చూడాల్సిందెయ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: